Begin typing your search above and press return to search.
‘స్పైడర్’ షో పడకముందే నాలుగో స్థానం
By: Tupaki Desk | 27 Sep 2017 4:18 AM GMTమహేష్ బాబుకు యుఎస్ లో ఉండే ఫాలోయింగ్.. మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అక్కడతను తిరుగులేని సూపర్ స్టార్. యుఎస్ లో మిలియన్ డాలర్ క్లబ్బును అందుకున్న తొలి హీరో అతనే. 1 నేనొక్కడినే.. ఆగడు.. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లతోనూ మహేష్ మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషమే. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’పై అక్కడ ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రానికి అక్కడ భారీ స్థాయిలో ప్రిమియర్స్ పడుతున్నాయి. ప్రిమియర్ షోలు ఇంకా మొదలు కాకముందే.. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిందీ సినిమా.
మంగళవారం ఉదయం 11 గంటల సమయానికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘స్పైడర్’ 6.7 లక్షల డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. అప్పటికింకా షోలే పడలేదు. ప్రిమియర్ల ద్వారా అత్యధిక వసూల్లు సాధించిన తెలుగు సినిమాల్లో అప్పుడే నాలుగో స్థానానికి చేరుకుంది ‘స్పైడర్’. ‘కాటమరాయుడు’ సినిమా ప్రిమియర్లు పూర్తయ్యేసరికి సాధించిన కలెక్షన్ల కంటే కూడా ‘స్పైడర్’ కలెక్షన్లు ఎక్కువ. బాహుబలి రెండు భాగాలు కాకుండా ఒక్క ‘ఖైదీ నంబర్ 150’ మాత్రమే అప్పటికి ‘స్పైడర్’ కంటే ఎక్కువగా ప్రిమియర్ కలెక్షన్లు సాధించింది. ఆ సినిమా ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల క్లబ్బును అందుకుంది. ‘స్పైడర్’ కూడా మంగళవారం ప్రిమియర్లతో ఈజీగా మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు.