Begin typing your search above and press return to search.
సర్కార్ మీద స్పైడర్ దెబ్బ!
By: Tupaki Desk | 5 Nov 2018 11:21 AM GMTరేపు విడుదల కానున్న విజయ్ సర్కార్ మీద తమిళనాడు లో కనివిని ఎరుగని బజ్ ఉండగా తెలుగులో మాత్రం పెద్దగా అలికిడి లేకుండా గప్ చుప్ గా వస్తోంది. మాములుగా హీరో ఎవరు అనేదానితో సంబంధం లేకుండా మురుగదాస్ సినిమా అంటేనే మనవాళ్ళు కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. కానీ సర్కార్ విషయంలో మాత్రం ఇది రివర్స్ లో ఉంది. దానికి కారణం స్పైడరే అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. అంత పెద్ద అవకాశం ప్రిన్స్ ఇస్తే ఒక సైకో థ్రిల్లర్ కథను మురుగదాస్ నడిపించిన తీరు ఆరవ తంబీలను సైతం మెప్పించలేదు. దాంతో మురుగదాస్ మీద టాలీవుడ్ లవర్స్ నమ్మకం సన్నగిల్లిపోయింది.
దానికి నిదర్శనంగా చాలా సెంటర్స్ లో సర్కార్ అడ్వాన్స్ బుకింగ్స్ నత్త నడకన సాగడం కూడా చెప్పుకోవచ్చు. విజయ్ తుపాకీ తర్వాత అతనికి ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ మార్కెట్ ఏర్పడింది. దాని వల్లే సర్కార్ మీద పబ్లిసిటీ చేయకపోయినా ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే ఇక్కడ షాక్ తప్పేలా లేదు. మురుగదాస్ తెలుగు వాళ్ళ నమ్మకం పోగొట్టుకోవడం ఇది రెండోసారి. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఏరికోరి మరి పిలిచి స్టాలిన్ అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగపరుచుకోలేదు. స్పైడర్ తరహాలోనే దానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ కంటెంట్ తేడాగా ఉండటంతో బొమ్మ ఆడలేదు. కాకపోతే స్పైడర్ కంటే కాస్త నయం అంతే.
అందుకే సర్కార్ మీద ఇవన్నీ ప్రతికూలాంశంగా మారాయి. పైగా తమిళ డబ్బింగ్ అంటే ఈ మధ్య పెద్దగా క్రేజ్ ఉండటం లేదు. రజనీకాంత్ కాలా విడుదల తేదీ సాయంత్రానికే థియేటర్లు బోసిపోయాయి. సో సర్కార్ టాక్ చాలా బాగుంది అని వస్తే మరుసటి రోజులో పికప్ ఉంటుంది. లేదంటే ప్యాకప్ తప్పదని ట్రేడ్ మాట. రేపీపాటికి ఫలితం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఓ పద్దెనిమిది గంటలు ఓపిక పడితే సరి.