Begin typing your search above and press return to search.
ఆ నటుడు భార్య మీద నిఘా పెట్టించాడా?
By: Tupaki Desk | 11 March 2018 6:27 AM GMTప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్య అంజలి మీద అనుమానంతో ఓ డిటెక్టివ్ ను నియమించి ఆమె కాల్ డేటాను రహస్యంగా సేకరించినట్లుగా నవాజుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తమ వ్యక్తిగత కాల్స్ ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీులు.. ‘కాల్ డేటా స్కామ్’ పేరుతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్టు చేయగా.. అందులో ఇద్దరు ప్రైవేటు డిటెక్టివ్ లు కూడా ఉన్నట్లు తేలింది.
అందులో ఒక డిటెక్టివ్ ను విచారించగా.. నటుడు నవాజుద్దీన్ తన భార్య మీద అనుమానంతో తనతో నిఘా పెట్టించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించి ఇవ్వాలని తనకు పని ఇచ్చాడని.. ఇందుకోసం తనకు రూ.50 వేలు చెల్లించాడని ఆ డిటెక్టివ్ పోలీసులకు చెప్పినట్లుగా వెల్లడైంది. దీంతో విచారణకు రావాల్సిందిగా నవాజ్ కు పోలీసులు సమన్లు జారీ చేసినట్లుగా ముంబయి మీడియా వెల్లడించింది. ఐతే ఈ ఆరోపణల్ని నవాజుద్దీన్ ఖండించాడు. మీడియా వాళ్లు తనను సంప్రదించినపుడు తన కూతురి స్కూల్ ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నానని.. ఈ లోపు తన గురించి అసత్య ప్రచారం మొదలుపెట్టేశారని అన్నాడు. మరి నవాజ్ పై వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో చూడాలి.