Begin typing your search above and press return to search.

రియల్ లైఫ్ లో స్క్విడ్ గేమ్.. మీరు కూడా వెళ్లొచ్చు!

By:  Tupaki Desk   |   16 Jun 2022 6:30 AM GMT
రియల్ లైఫ్ లో స్క్విడ్ గేమ్.. మీరు కూడా వెళ్లొచ్చు!
X
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ సామ్రాజ్యంలో రారాజుగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్ ప్రతీ ఏడాది ఎదో ఒక వెబ్ సీరీస్ ద్వారా క్రేజ్ అందుకుంటూనే ఉంది. అయితే ఇటీవల ఆ సంస్థ కొంత వెనుకబడింది. అంతే కాకుండా భారీ స్థాయిలో నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సక్సెస్ ఫార్ములాను కంటిస్యూ చేసేందుకు సిద్ధమైంది. జనాలను తనవైపు తిప్పు కునేందుకు సరికొత్తగా అడుగులు వేస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో స్క్విడ్ గేమ్ ఒకటి.

ప్రపంచ స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిందిన ఈ వెబ్ సీరీస్ ఆన్ లైన్ గేమ్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. అనేక దేశాలలో భారీగా అభిమానానులను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ షో ఆధారంగా ఏకంగా ఒక రియాలిటీ గేమ్ సిరీస్‌ను ప్రకటించింది. స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ పేరుతో ఇటీవల ఒక ప్రకటన కూడా చేసింది. ఈ రియాలిటీ షోలో మొత్తంగా 456 మంది పోటీదారులు పాల్గొంటారట.

అయితే వారు వెబ్ సీరీస్ షోలో ఉన్న ఉన్నట్లుగానే స్క్విడ్ గేమ్‌ తరహాలోనే వరుస గేమ్‌లను ఆడాల్సి ఉంటుంది. రియాలిటీ స్క్విడ్ గేమ్ లో గెలిస్తే మొత్తంగా $4.56 మిలియన్ USD నగదు బహుమతిగా పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల వారు ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చుని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
https://www.squidgamecasting.com/

ఇక ఇప్పటికే యూఎస్ఏ, యూకే అలాగే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఈ పోటీకి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందట. ఇక స్క్విడ్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగా హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ దర్శకత్వంలో వచ్చిన స్క్విడ్ గేమ్ సెప్టెంబరు 2021లో ప్రదర్శించబడింది. అతి తక్కువ కాలంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా కూడా క్రేజ్ అందుకుంది.

ఇక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం, స్క్విడ్ గేమ్ మొదటి 28 రోజుల్లో 1.65 బిలియన్ వీక్షణ గంటలను నమోదు చేసింది. అలాగే ప్రస్తుతం రెండవ సీజన్ కు సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక ఇంతలో రియాలిటీ గేమ్ తో మరింత బజ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు.