Begin typing your search above and press return to search.
తెలుగులో తీసిన ఇంగ్లీష్ సినిమాలా అనిపించింది!
By: Tupaki Desk | 2 Jun 2020 1:30 PM GMTతెలుగు ఇండస్ట్రీ అన్నగారు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణలు ఎంత గొప్ప నటులో అందరికి తెలిసిందే. ఎన్నో యేళ్లు తెలుగు చిత్రసీమకు వీరు అందించిన సేవలు మర్చిపోలేనివి. ఎన్టీఆర్ - కృష్ణలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. విడివిడిగా పోటీ పడి మరీ సినిమాలు చేశారు. కానీ నిజానికి ఒకరి పనిని ఒకరు గౌరవిస్తారు.. అభినందిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ తన కాలేజీ రోజుల నుండే అన్నగారు ఎన్టీఆర్ కి వీరాభిమాని. అయితే హీరో అయిన తర్వాత సూపర్ స్టార్ చేసిన సినీ ప్రయోగాలు ఏ హీరో కూడా చేయలేదని చెప్పాలి. తన మొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు.. సినిమా విడుదలై భారీ హిట్ అయింది. ఆ సినిమాను ఎన్టీఆర్ గారు చూసి తన అభిప్రాయాలు.. అభినందనలు లేఖ రూపంలో తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణను అభినందిస్తూ.. లేఖలో ఇలా పేర్కొన్నారు.
"సోదరుడు శ్రీకృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడు సినిమా చూసాను. ఎంతో ప్రయాసలకు లోనై, ఒక విశిష్టమైన సాంకేతిక విలువలతో ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం.. పట్టుదల ప్రతి షాటులోను, ప్రతి ఫ్రేములోను కన్పించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రమా అనిపించింది. ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రహణం.. ఇంత మనోజ్ఞంగా ఉన్నత ప్రయాణంలో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినందనీయుడు. కథకు అనుగుణమైన వేగంతో దర్శకత్వం వహించిన శ్రీ వాసు ప్రశంసాపాత్రుడు. అన్నారు. అంతేగాక ఇంత సాంకేతిక విలువలతో జాతీయత, మన సంస్కృతి, మన సాంఘిక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావ పూరితములైన మహత్తర కళాఖండాలను అభిమానులకు శ్రీ కృష్ణ అందించగలరని ఆశిస్తూ.. సాహసోపేతమైన ఈ చిత్ర నిర్మాణ కృషికి కృష్ణను అభినందిస్తున్నాను.." అంటూ అన్నగారు రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లెటర్ చెప్తుంది కదా.. ఎన్టీఆర్-కృష్ణల మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం, ఫ్రెండ్ షిప్ ఉందో..!