Begin typing your search above and press return to search.
రంగస్థలంలో ఎన్టీఆర్ పాలిటిక్స్
By: Tupaki Desk | 19 Feb 2018 10:51 AM GMTఇప్పటికే రంగస్థలంపై అంచనాలు భారీగా ఉన్నాయి... ఇప్పుడు మరింతగా పెరిగేలా వార్తలు బయటికి వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాముడు - కృష్ణుడు - దేవుడు అయినా సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా రంగస్థలంలో ఉండబోతోందట. అదెలా సాధ్యం?
రంగస్థలం సినిమా 1985 నాటిది కావడంతో... అప్పటి పరిస్థితులను చూపించబోతున్నారు. ఆ కాలంలోనే తెలుగు నటుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి... చక్రం తిప్పుతున్నారు. రంగస్థలంలోనే ఎన్టీఆర్ కనిపించే సీన్లు కూడా ఉండబోతున్నాయని సమాచారం. కనీసం ఆయన ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్యదేవుడు కనుక... ఆయన తెరపై కనిపించిన క్షణాల్లో థియేటర్ దద్దరిల్లి పోవడం ఖాయం. అంటే నందమూరి అభిమానులను కూడా సుకుమార్ తన సినిమాకు రప్పించుకుంటాడన్నమాట.
రంగస్థలం ఒక పల్లెటూరి కథ. అందులో రామలక్ష్మి - సౌండ్ లెస్ చిట్టిబాబుగా సమంత - రామ్ చరణ్ నటించారు. చెర్రీ తన కెరీర్ లోనే చాలా డిఫరెంట్ పాత్ర ఇందులో చేస్తున్నాడు. చెవిటి వాడిగా చేయడంతో పాటూ... గుబురు గడ్డాలతో... లుంగీ పంచెలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా రామలక్ష్మికి వీరప్రేమికుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ట్రైలర్లు - పాటలు హిట్ కొట్టాయి. సినిమా విడుదలైతే రికార్డులు బద్దలవ్వడం ఖాయంలా కనిపిస్తోంది.