Begin typing your search above and press return to search.
నేను శైలజ పైరసీ ప్రింట్ @ 2 లక్షలు
By: Tupaki Desk | 13 Jan 2016 7:30 AM GMTథియేటరుకెళ్లి ‘నేను శైలజ’ సినిమా చూసే ఓపిక లేనోళ్లకు ఆ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. నేను శైలజ డౌన్ లోడ్ చేసుకుని పైరసీ ప్రింట్ చూడండి. జస్ట్ రెండు లక్షలు కట్టేయండి చాలు అంటున్నాడు. మరీ చీప్ రేటే కదూ ఇది. ఇంతకీ ఈ రెండు లక్షల మేటరేంటో చూద్దాం పదండి.
కొత్త సినిమాల్ని పైరసీ చేయడం.. వాటిని యథేచ్ఛగా నెట్లో పెట్టేయడం.. జనాలు డౌన్ లోడ్ చేసుకోవడం కొత్తేం కాదు. ఇటీవల కాలంలో ఈ జాఢ్యం మరీ విస్తరించిపోతోంది. పరిశ్రమ పెద్దలు పైరసీని అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఐతే తన సినిమా పైరసీని అడ్డుకోవడానికి స్రవంతి రవికిషోర్ గట్టి ప్రయత్నమే చేశారు. ఈ పైరసీ అప్ లోడ్స్ అన్నీ ఫారిన్లో.. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి జరుగుతాయని తెలిసి, అక్కడి నుంచే నరుక్కొచ్చారు. డల్లాస్ బయ్యర్స్ క్లబ్ ద్వారా అక్కడి కోర్టు దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లగా.. ‘నేను శైలజ’ సినిమాను డౌన్ లోడ్ చేసిన వారికి రూ.2 లక్షలు జరిమానా విధించేలా అక్కడి కోర్టు ఆదేశాలిచ్చింది.
దీని గురించి స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ.. ‘‘నేను శైలజ అనధికారిక కాపీని డౌన్ లోడ్ చేసేవాళ్లకు ఐదు వేల నుంచి ఏడు వేల ఆస్ర్టేలియన్ డాలర్లు జరిమానా విధించవచ్చని 'డల్లాస్ మూవీ బయ్యర్స్ క్లబ్'కు ఇటీవల ఆస్ర్టేలియన్ కోర్టు అనుమతినిచ్చింది. యుస్ లో కూడా వార్నర్ బ్రదర్స్ సంస్థ డౌన్ లోడ్ చేస్తున్నవారికి 20 డాలర్లు జరిమానా విధిస్తోంది. భారతీయ చట్ట ప్రకారం రెండు లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు. 'నేను శైలజ'ను డౌన్ లోడ్ చేస్తున్నవారి ఐపీ అడ్రస్ లను సేకరిస్తున్నాం. అందరికీ చట్టపరంగా నోటీసులు పంపించనున్నాం'' అని చెప్పారు.