Begin typing your search above and press return to search.

సినిమా స్టార్ట్ అవ్వకముందే 2 కోట్లు నష్టం

By:  Tupaki Desk   |   26 May 2018 6:11 AM GMT
సినిమా స్టార్ట్ అవ్వకముందే 2 కోట్లు నష్టం
X
ఒక సినిమా మొదలు పెట్టాలంటే నిర్మాత డబ్బులు పెడుతూనే ఉండాలి;. రిలీజ్ అయ్యాక ఎన్ని లాభాలు వస్తాయో గాని ముందు మాత్రం ప్రతి రూపాయి రోజు జేబులోంచి పరిగెత్తుతూనే ఉంటుంది. ఒకప్పుడు సినిమా మొదలు పెడితేనే లెక్కలు స్టార్ట్ అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా పట్టాలెక్కకముందే ప్రీ ప్రొడక్షన్ వల్ల ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. సినిమా కథల కారణంగా కొందరు దర్శకులు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు చాలా పెంచేస్తున్నారు.

స్టోరీ సిట్టింగ్.. లొకేషన్స్ - ఆడిషన్స్.. ఇలా చాలా రకాలుగా నిర్మాతకు సినిమా మొదలవ్వకముందే ఖర్చులు ఎక్కువవుతున్నాయి. రీసెంట్ గా సీనియర్ నిర్మాత స్రవంతి రవికోశోర్ కి అదే తరహాలో 2 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందట. సినిమా మొదలవక్కముందే ప్రీ ప్రొడక్షన్ వల్ల 2 కోట్లు ఆవిరయ్యాయని చెబుతున్నారు. రామ్ కథానాయకుడిగా గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా సెట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు గట్టిగా స్టార్ట్ చేసినప్పటికీ నిర్మాతకు దర్శకుడిగా మధ్యలో బడ్జెట్ వల్ల కొంచెం ఈగో క్లాష్ అవ్వడంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఎండ్ అయినట్లు తెలుస్తోంది. రామ్ మార్కెట్ పరిధిని ధాటి సినిమా బడ్జెట్ వెళుతుండడంతో స్రవంతి రవికిశోర్ దర్శకుడితో వారించడం జరిగిందని సమాచారం. అందువల్లే రవి కిశోర్ పట్టాలెక్కని మూవీ వల్ల రెండు కోట్లు నష్టపోయారని తెలిపారు.