Begin typing your search above and press return to search.
రూమర్లను ఖండించిన పెదనాన్నగారు
By: Tupaki Desk | 27 Oct 2017 6:09 AM GMTరూమర్స్ కి గాలికి నిజంగా తెలియని ఒక సంబంధం ఎదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్క చిన్న పాయింట్ దొరికితే చాలు గాలికంటే వేగంగా వెళుతున్నాయి. అనకాపల్లిలో స్టార్ట్ అయితే మరో నిమిషంలో అమెరికాకు వెళుతున్నాయి. అది తెలుసుకున్న తారలకు ఒక్కోసారి విషయం అర్థం కాదు. ఈ రోజుల్లో ఇండస్ట్రీకి తీరని ఇబ్బంది ఏదైనా ఉందంటే గాసిప్స్ ఒక్కటనే చెప్పాలి.
ఇటీవల హీరో రామ్ - నిర్మాత బెల్లం కొండ సురేష్ కాంబో పై వచ్చిన ఒక రూమర్ తెగ హల్ చల్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ కందిరీగ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. సినిమా హిట్ అవ్వడంతో అదే ఊపులో ఈ టీమ్ కందిరీగ 2 తీద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదు. అదే స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ తో రభస గా తీశారని టాక్ ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నపుడు రామ్ కి నిర్మాత బెల్లంకొండ సురేష్ అడ్వాన్స్ గా 1.5 cr ఇచ్చారట.
కానీ రామ్ ఇప్పటివరకు ఆ రెమ్యునరేషన్ ని తీరిగి ఇవ్వకపోవడంతో రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగి సినిమా రిలీజ్ కు బెల్లంకొండ అడ్డు పడుతున్నారని కామెంట్స్ వినిపించాయి. అలాగే రామ్ కి వార్నింగ్ లు ఇచ్చినట్లు కూడా గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే విషయం తెలుసుకున్న రామ్ పెదనాన్నగారు అండ్ చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్ చాలా నవ్వుకున్నారట. అసలు ఇలాంటి అర్థం లేని రూమర్స్ ఎలా క్రియేట్ అయ్యాయో తనకు అస్సలు అర్థం కావడం లేదని గత కొన్ని రోజులుగా తను ఇక్కడ లేనని ఆయన చెప్పారు. అలాగే రూమర్స్ పూర్తిగా అవాస్తవమని కూడా ఆయన తెలిపారు.