Begin typing your search above and press return to search.
మా పరిస్థితి ఊహిస్తే భయంగా ఉంది: ప్రముఖ నిర్మాత
By: Tupaki Desk | 9 May 2020 5:30 PM GMTకరోనా కారణంగా టాలీవుడ్ సినిమాలు షూటింగ్స్ నిలుపుకొని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. నిజానికి ఈ సమ్మర్ సీసన్ అంతా సినిమా సందడితో మార్మోగిపోయేది. కానీ ప్రస్తుతం అదేం జరగట్లేదు.. అంతా మూలన పడుకొని చూస్తున్నారు. ఎన్నో విడుదలకు సిద్దమైన సినిమాలు లాక్ డౌన్ లేపేస్తే రిలీజ్ అవుదామని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. అందులో ఒకటి రామ్ హీరోగా నటించిన రెడ్ మూవీ. ఫస్ట్ టైం రామ్ డ్యూయెల్ రోల్ పోషించగా.. ఈ సినిమా విడుదల టైంకి కరోనా అడ్డుకట్ట వేసింది. ఏప్రిల్ 9నే విడుదల కావాల్సిన రెడ్ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా నిర్మాత స్రవంతి రవికిశోర్ తాజాగా ఇటలీ దేశంలో రెడ్ షూటింగ్ జరిపిన రోజుల గురించి మాట్లాడారు.
'ఇటలీ దేశం ఎంతో అందమైనది అని పొగిడిన ఆయన ఇటలీ దేశంలో ఎన్నో చూడదగ్గ అందమైన ప్రదేశాలు ఉన్నాయని.. అలాంటి అందమైన ప్రదేశంలో మా సినిమాకు సంబంధించి రెండు పాటలను షూట్ చేసినట్లు తెలిపారు. ఇక ఇటలీలోని బ్యూటిఫుల్ ప్లేస్ అయిన డోలోమైట్స్ లో షూటింగ్ జరిపిన ఫస్ట్ తెలుగు సినిమా ఇదేనని గుర్తుచేశారు. ఇటీవలే విడుదల చేసిన నువ్వే నువ్వే సాంగ్ లేక్ గార్దాలో షూట్ చేశామని.. అది బెల్గామో సిటీకి దగ్గరలో ఉన్నట్లు తెలిపారు. ఇక ఇటలీలో బెల్గామో సిటీ ఇటలీ దేశంలోనే కరోనా వైరస్ కి కేంద్రంగా మారింది. మేం ఫిబ్రవరి 15, 16 తేదీలలో లేక్ గార్దా, డోలోమైట్స్ ఏరియాలలో షూట్ చేసి వెంటనే ఇండియాకి తిరిగి వచ్చాము. మేం వచ్చిన వారంలోపే ఆ ఏరియాలో 16కరోనా కేసులు నమోదయ్యాయి. మేం ముందే వచ్చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. లేదంటే మా పరిస్థితి ఎలా ఉండేదో అని ఊహిస్తేనే భయంగా ఉందన్నట్లు ఆయన తెలిపారు.