Begin typing your search above and press return to search.

ఈ తెలుగు పిల్ల ఏమైపోయింది?

By:  Tupaki Desk   |   12 Jun 2015 1:30 PM GMT
ఈ తెలుగు పిల్ల ఏమైపోయింది?
X
లవ్‌ యు బంగారం సినిమాతో మెరుపులు మెరిపించింది శ్రావ్యారెడ్డి. చారెడేసి కళ్లు గిరగిరా తిప్పేస్తూ.. బూరె బుగ్గలలో ముసిముసి నవ్వులు చిందిస్తూ.. బుజ్జి బుజ్జిగా ముద్దొచ్చే తెలుగు మాట్లాడేస్తూ .. ఆకట్టుకుంది ఈ అమ్మడు. హ్యాపీడేస్‌ రాహుల్‌ ఈ భామ కళ్ల తిప్పుడుకి పడిపోయాడంటే అతిశయోక్తి కాదు. రాహుల్‌ ఒక్కడే ఏం కర్మ? ఏ కుర్రాడైనా ఈ తెలుగమ్మాయిని చూసి మనసు పారేసుకోవాల్సిందే.

మన దర్శకనిర్మాతలు సైతం ఈ క్యూట్‌ అప్పియరెన్స్‌కి మనసు పారేసుకుని 'లవ్‌ యు బంగారం'లో నటించే అవకాశం ఇచ్చారు. తొలి అవకాశం మెచ్చుకోదగినదే. కానీ ఎందుకనో బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో కెరీర్‌ పరంగా జెట్‌స్పీడ్‌లో వెళ్లే ఛాన్స్‌ రాలేదు. ఇదిగో అప్పుడప్పుడు ఇలా ఫోటోషూట్‌లతో టచ్‌లోకి వస్తోంది. గాగ్రా చోళీలో ఎంతో పద్ధతిగా కనిపిస్తున్న ఈ అమ్మడి ప్రత్యేకత అంతా ఆ చూపుల్లోనే ఉంది. పెద్ద పెద్ద కళ్లను గింగిరాలు తిప్పుతూ క్యూట్‌ స్మయిల్‌తో ఆ బుగ్గల్లోకి నిగ్గుల్ని తెచ్చినప్పుడు ఉంటుందీ.. నా సామిరంగా..!

దర్శకనిర్మాతలూ.. తెలుగమ్మాయే కదా! అని తీసి పారేయకండి. ఓ ఛాన్సిచ్చి చూడండి. శ్రావ్య సత్తా ఎంతో చూపిస్తుంది. లేదంటే నందిత, రక్షిత, శ్రీదివ్య, బిందుమాధవి లానే మనమీద అలిగి తమిళ పరిశ్రమకే అంకితమైపోతుంది. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉంది కాబట్టి విరమించాలంటే ఛాన్సులిచ్చి ప్రోత్సహించండి.