Begin typing your search above and press return to search.
అలీ కోసం ఏడ్చిన జ్యోతి..వాడు చచ్చిపోలేదన్న శ్రీముఖి
By: Tupaki Desk | 10 Sep 2019 4:36 AM GMTబిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఊహించని విధంగా అలీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్ లో అలీ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు అందరూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే సోమవారం ఎపిసోడ్ లో అలీ లేను లోటు స్పష్టంగా కనపడింది. రోజులాగా ఇంటి సభ్యులు యాక్టివ్ గా లేరు. శివజ్యోతి అయితే లేవగానే ఏడ్చింది. అలీ లేకుండా ఉండలేకపోతున్నా అంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో పునర్నవి ఆమెని ఓదార్చింది.
బిగ్ బాస్ నాతో ఎమోషనల్ ఆడుకుంటున్నాడని, ఇష్టమైన అషు - రోహిణి - అలీలని ఎందుకు పంపించేసావని జ్యోతి బోరున ఏడ్చింది. అయినా నా గేమ్ నేను ఆడతానని చెప్పింది. తర్వాత రవి ఏడవటం మొదలుపెట్టాడు. ఇక రవిని చూసి జ్యోతి మళ్ళీ మొదలుపెట్టింది. ఇద్దరు ఏడుస్తూ..ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు. ఇక వీరిని చూసి శ్రీముఖి మండిపడింది. ఆపండి...ఇదేమి సంతాప సభ కాదు...అలీ ఏమి చచ్చిపోలేదంటూ ఫైర్ అయింది. వాడు చక్కగా ఇంట్లో ఎంజాయ్ చేస్తాడు అని చెప్పింది. దీంతో వారు సైలెంట్ అయిపోయారు.
వీరి ఏడుపు కార్యక్రమం అయిపోయాక శివజ్యోతి - హిమజలకు బిగ్ బాస్ ఓ సరదా టాస్క్ ఇచ్చాడు. జ్యోతి రిపోర్టర్ గ -, హిమజ కెమెరా వుమెన్ గా ఉండి. ఇంటి లోని కొన్ని సందర్భాలని ఒప్పో రెనో ఫోన్ ద్వారా క్యాప్చుర్ చేసి వాటి మీద రిపోర్ట్ చేయాలని కోరాడు. దీంతో ఇద్దరు ఇంటిలో ఒక్కొక్కరి ఫోటో తీసి దానికి సరదా స్టోరీలు చెప్పారు. అలాగే ఓ వీడియో కూడా తీసి దాన్ని చివర్లో స్టోరీగా చెప్పారు. వీటి అన్నిటిని హౌస్ లోని టీవీ ద్వారా మిగతా ఇంటి సభ్యులకు చూపించారు.