Begin typing your search above and press return to search.

హాట్ యాంక‌ర్ ప్రేమ‌లో.. ఎవ‌రా ల‌క్కీ ఫెలో

By:  Tupaki Desk   |   26 Feb 2020 9:30 AM GMT
హాట్ యాంక‌ర్ ప్రేమ‌లో.. ఎవ‌రా ల‌క్కీ ఫెలో
X
యాంక‌ర్ ప్రేమ‌లో ప‌డితే త‌ప్పేంటి? ఏ వాళ్ల‌కు ల‌వ్వు గివ్వు అవ‌స‌రం లేదా? అందుకే ఆ చిలిపి కుర్రాళ్లు ఇవే ప్ర‌శ్న‌లు అడిగారు బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖిని. బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా అన్నిచోట్లా కెరీర్ స్పీడ్ చూపించిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల కాస్త త‌గ్గిన‌ట్టే కనిపిస్తోంది.

ఒక‌వేళ ఇంట్లో వాళ్లు పెళ్లాడ‌మ‌ని పోరుతున్నారో ఏమో కానీ శ్రీ‌ముఖి ఇస్పీడ్ కాస్తంత త‌గ్గింది. ఇక బిగ్‌బాస్ సీజన్-3 రన్నరప్ గా నిలిచిన శ్రీ‌ముఖి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. ఇక‌పోతే లేటెస్టుగా త‌న వీరాభిమానుల‌తో సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో చాట్ చేసిన త‌న‌కు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఇందులో త‌న ల‌వ్ .. పెళ్లి గురించిన ప్ర‌శ్న‌లు ఉన్నాయి. `మీరు ప్రేమలో ఉన్నారా?` అన్న ప్ర‌శ్‌న‌కు అవును అంటూ చెప్పిన శ్రీ‌ముఖి.. `ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా? అని కొంటెగా ప్ర‌శ్నించారు. దానికి ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా అంతే కొంటెగా.. `అవును వద్దన్నా` అంటూ జ‌వాబిచ్చింది.

ప‌రీక్ష‌ల్లో మాస్ కాపీయింగ్ ని.. స్నేహితుల‌కు అబ‌ద్ధాలు చెప్పిన సంగ‌తిని శ్రీ‌ముఖి నిజాయితీగా ఈ వేదిక‌పై అంగీక‌రించింది. అన్న‌ట్టు త‌ను ల‌వ్ లో ఉన్నాన‌ని చెప్పింది. ఇంత‌కీ ఎవ‌రా ల‌క్కీ గ‌య్? మ‌రో యాంక‌ర్ అయ్యి ఉండొచ్చా? లేదంటే స్టార్ నే ప్రేమించేస్తోందా? వ‌య‌సు మీద ప‌డుతోంది క‌దా.. ఇంత‌కీ పెళ్లెపుడో?