Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ ఎలిమినేషన్: ఈ సారి అందరూ గట్టొళ్లే
By: Tupaki Desk | 24 Sep 2019 5:13 AM GMTబిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులు తగ్గేకొద్దీ....పోటీ బాగా పెరిగిపోతుంది. ఆదివారం హిమజ వెళ్లిపోవడంతో ఇంటిలో 9 మంది మిగిలారు. ఫేక్ ఎలిమినేషన్ వల్ల వేరే రూమ్ లో ఉన్న రాహుల్...అసలు హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే హౌస్ లో ఉన్న 9 మంది మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో ఎలిమినేషన్ ప్రక్రియ టఫ్ గా సాగింది. 10వ వారం నామినేషన్స్ లో భాగంగా 9 మంది సభ్యుల్లో కెప్టెన్ మహేశ్ ని పక్కనబెట్టి మిగిలిన 8 మందిని జంటలుగా విభజించారు. శివజ్యోతి-శ్రీముఖి - రవి-వితికా - వరుణ్-రాహుల్ - బాబా భాస్కర్-పునర్నవిలని జంటలుగా పెట్టి...వారిలో ఎవరికి ఇంట్లో ఉండటానికి అర్హతలు ఉన్నాయో - గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాదించుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు.
దీంతో రంగంలోకి దిగిన శివజ్యోతి-శ్రీముఖిలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. నేను తోపు అంటే...నేను తోపు అని చెప్పుకున్నారు. వీరి వాదన ముగిశాక ఇంట్లోని మిగతా సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. మహేశ్ - బాబా భాస్కర్ - రవి - రాహుల్ లు...జ్యోతికి ఓటు వేశారు. వరుణ్ - పునర్నవి - వితికాలు...శ్రీముఖికు ఓటు వేశారు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన జ్యోతి సేవ్ అయ్యి...శ్రీముఖి ఎలిమినేషన్ లోకి వెళ్లింది. అనంతరం.. వితికా - రవిల మధ్య నామినేషన్స్ వార్ జరగ్గా ఈ ఇద్దరిలో హౌస్ మేట్స్ నుండి వితికాకే ఎక్కువ ఓట్లు రావడంతో వితికా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి రవి ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లాడు.
ఇక మూడో జోడీగా వరుణ్-రాహుల్ మధ్య నామినేషన్ జరగగా...ఈ ఇద్దరు వాదోపవాదాలు పెద్దగా చేసుకోకుండా...కూల్ గా మాట్లాడుకున్నారు. అయితే ఓటింగ్ ఎక్కువ రాహుల్ కు రావడంతో...అతని సేఫ్ అయ్యి...వరుణ్ నామినేషన్ లోకి వెళ్ళాడు. నాలుగో జోడీగా వచ్చిన పునర్నవి - బాబా భాస్కర్ ల మధ్య చర్చ వాడివేడిగా జరిగింది. అయితే పునర్నవి బాబా గేమ్ ఆడటం లేదని...ఎంటర్టైన్మెంట్ ఒకటే చేస్తున్నారని...గేమ్ లో నేనే తోపు అని బాబా వేస్ట్ అన్నట్లు మాట్లాడింది. అలా పునర్నవి ఎన్ని మాట్లాడినా...బాబా మాత్రం కూల్ గా పున్నూకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఓటింగ్ లో పున్నూకు నాలుగు ఓట్లు వస్తే...బాబాకు మూడు ఓట్లు వచ్చాయి. దీంతో పున్నూ సేఫ్ అయ్యి..బాబా ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్లారు.
చివరికి ఈ వారం నలుగురు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చారు. శ్రీముఖి - రవి - వరుణ్ - బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. అయితే వీరు నలుగురు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ కావడంతో...ఈ వారం ఎలిమినేషన్ ఓటింగ్ టఫ్ గా జరిగే అవకాశం ఉంది. మరి వీరిలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకెళ్లతారో చూడాలి.