Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో శ్రీముఖి వ‌ర్సెస్ వ‌రుణ్‌

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:53 AM GMT
బిగ్‌ బాస్‌ లో శ్రీముఖి వ‌ర్సెస్ వ‌రుణ్‌
X
బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన సరదా టాస్క్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ టాస్క్ మధ్యలో వరుణ్-శ్రీముఖి మ‌ధ్య‌ చిన్నపాటి మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు సరదా టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఇంటి సభ్యులని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి వారికి చిన్న చిన్న టాస్క్‌ లు ఇచ్చారు. ఆ టాస్క్ చేసిన తర్వాత వారు బయటకొచ్చి...లోపల జరిగింది చెబుతారు. ఇక అది నిజమా ? కాదా ? అనే విషయాన్ని గెస్ చేసి చెప్పాలి. ఎక్కువ కరెక్ట్ చెబితే...రాత్రికి మంచి డిన్నర్ లభిస్తుంది.

ఈ టాస్క్ లో భాగంగా మొదట బాబా భాస్కర్ వెళ్ళి వచ్చి ఏ‌బి‌సి‌డిలు చెప్పించారని చెప్పారు...ఇంటి సభ్యులు కూడా అది నిజమే అని గెస్ చేశారు. ఆ తర్వాత రవి-హిమజ కలిసి వెళ్లారు. రవి-హిమజలకు లోపల స్వీట్స్ - చాక్లెట్స్ తినమని చెప్పారు. వీరి తర్వాత శివజ్యోతి-పునర్నవిలు కలిసి వెళ్లారు. వీరిలో ఒకరి చేత తెలుగు పద్యాలు - మరొకరు చేత ఇంగ్లీష్ రైమ్స్ చెప్పించారు. అలాగే వరుణ్-వితికాలు వెళ్ళగా...వారిని సీక్రెట్ గా మాట్లాడుకోమని చెబుతారు. అయితే వీరంతా బయటకొచ్చి లోపల జరిగింది చెబుతారు. అది నిజమే అని మిగతా వాళ్ళు గెస్ చేశారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ రాహుల్ ఒక్కడినే లోపలకి పిలిచి 50 సిటప్స్ చేసి..10 యాప్పీ ఫిజ్ డ్రింక్స్ తాగమని చెబుతారు. అయితే చేసింది కాకుండా ఇంటి నుంచి అమ్మ ఫోన్ చేసిందని - పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పాలని బిగ్ బాస్ రాహుల్ కి చెబుతాడు. దీంతో రాహుల్ అలాగే చెబుతాడు. ఇక్కడే అన్నీ కరెక్ట్ గా గెస్ చేసేస్తాను అనుకునే శ్రీముఖి పప్పులో కాలేసింది. తను తప్పు చెప్పడమే కాకుండా మిగతా వాళ్ళ చేత కూడా తప్పు చెప్పించేలా చేసింది. వీరంతా రాహుల్ నిజం చెబుతున్నాడని అన్నారు. కానీ అది కరెక్ట్ కాదని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో వరుణ్ శ్రీముఖిపై ఫైర్ అయ్యాడు. నువ్వు నీ డెసిషన్ చెప్పుకోకుండా...కరెక్ట్ చెప్పకపోతే బొక్క పడుద్ది అని మాట్లాడి మిగతా వాళ్ళని ప్రభావితం చేసి వారి చేత కూడా తప్పు చెప్పించావని మండిపడ్డాడు.

‘నేను డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నా.. బొక్క పడిపోద్ది అన్నది నా లాంగ్వేజ్.. నా స్టైల్. నా అభిప్రాయం నేను చెప్పా అంటూ శ్రీముఖి తనదైన శైలిలో అరిచిచెప్పింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో మిగతా వాళ్ళు సర్ది చెప్పారు. అయితే చివరికి ఎక్కువ కరెక్ట్ సమాధానాలు చెప్పడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మంచి డిన్నర్ ఇచ్చాడు.