Begin typing your search above and press return to search.
శ్రీవిష్ణు ఆ సినిమా చేయనన్నాడా?
By: Tupaki Desk | 21 Sep 2022 7:18 AM GMTకెరీర్ ప్రారంభం నుంచి కొత్త కథల్ని, దర్శకుల్ని ప్రోత్సహిస్తూ తనదైన మార్కు సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు హీరో శ్రీవిష్ణు. ప్రేక్షకులకు కొత్త కథల్ని పరిచయం చేయాలని, సరికొత్త అనుభూతిని అందించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు కొన్ని సార్లు సూపర్ హిట్ లని అందిస్తున్నాయి. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. తొలిసారి ఈ మూవీలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ప్రదీప్ వర్మ దర్శకుడు.
మలయాళ హీరోయిన్ కయదు లోహర్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణు గోపాల్ ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 23న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి హీరో శ్రీవిష్ణు తాజాగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు పాత్రని స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారట. 'అల్లూరి సీతారామరాజు' మూవీ క్లైమాక్స్ లో సూపర్ స్టార్ కృష్ణ చెప్పినట్టు ఒక అల్లూరి సీతారామరాజు చనిపోతే వంద మంది అల్లూరిలు పుట్టుకొస్తారని చెప్పినట్టే ఆ వందలో ఒకడి కథే ఈ 'అల్లూరి'.
ఇదొక పవర్ ఫుల్ పోలీస్ అధికారి ఫిక్షనల్ బయోపిక్ అంటున్నారు శ్రీవిష్ణు. ఇక ఈ మూవీ చేయడానికి ఎలాంటి హోమ్ వర్క్ చేయలేదని, ఏ పోలీస్ అధికారిని కలవలేదన్నాడు. 'అల్లూరి' పాత్ర వల్ల తనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, తన చుట్టూ వున్న వారిపై చాలా సున్నితంగా వ్యవహరిస్తుంటానని, అయితే ఈ సినిమా తరువాత కొన్ని విషయాల్లో ప్రశ్నించడం మొదలు పెట్టానని తెలిపారు.
ఇక ఈ మూవీ గురించి మరో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ముందు పోలీస్ పాత్ర అనగానే 'అల్లూరి' చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదన్నాడు. కానీ దర్శకుడు ప్రదీప్ వర్మ కథ చెప్పిన తరువాత 'అల్లూరి' పాత్ర అద్భుతం అనిపించిందని, చాలా మంది కథ ఎలాగైనా చేయాలని అనుకున్నానని తెలిపారు. అంతే కాకుండా దర్శకుడు ప్రదీప్ వర్మ అల్లూరి పాత్రని ఎలా చేయాలని చాలా వరకు రిఫరెన్స్ లు చూపించాడని, దాంతో నాకు చాలా ఈజీ అయిందని చెప్పుకొచ్చాడు.
ఫైనల్ ఔట్ పుట్ చూశాక ఈ సినిమా విషయంలో చాలా సంతృప్తితో వున్నానని శ్రీ విష్ణు స్పష్టం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే శ్రీవిష్ణు 'అల్లూరి' మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం విశేషం. ఈ మూవీతో కెరీర్ భారీ హిట్ ని ఆశిస్తున్నాడు. శ్రీవిష్ణు నమ్మకాన్ని 'అల్లూరి' ఎంత వరకు నిజం చేస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.