Begin typing your search above and press return to search.
పొట్టిది గట్టిది అంటూ ఆటపట్టించాడు!
By: Tupaki Desk | 26 Jun 2019 7:54 AM GMTనివేద థామస్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనేలేదు. నిన్నుకోరి.. జెంటిల్ మేన్.. జై లవకుశ .. 118 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అందం .. అభినయం ఉన్న భామగా సుపరిచితం. దాంతోపాటే నివేద బెస్ట్ క్లాసికలో డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అయితే తనలోని డ్యాన్సర్ ని వెలుగులోకి తెచ్చేందుకు చేసిన సినిమానే `బ్రోచేవారెవరురా` అని చిత్రయూనిట్ చెబుతోంది. లేటెస్ట్ గా బ్రోచేవారెవరురా ప్రీరిలీజ్ వేడుకలో దీనిని చిత్రకథానాయకుడు శ్రీవిష్ణు కన్ఫామ్ చేశారు. నివేద లోని డ్యాన్సింగ్ స్కిల్స్ కి పడిపోయానని అతడు నివేదను తనదైన శైలిలో వర్ణించడం ఆసక్తికరం.
అసలు బ్రోచేవారెవరురా చిత్రం చేయడానికి కారణం ఇందులో మిత్ర పాత్ర అని శ్రీవిష్ణు తెలిపారు. ప్రీరిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ ``కథ వినగానే నచ్చింది. టైటిల్ బ్రోచేవారెవరురా అని ఫిక్స్ చేశారు. దర్శకుడు నేను సరే బ్రో అని అనుకునేవాళ్లం. ఈ కథను ఎంచుకోవడానికి నేను ఇందులో నటించడానికి కారణం `మిత్ర` అనే పాత్ర. ఆ రోల్ అంతగా నచ్చింది. మిత్ర భరతనాట్యం- కూచిపూడి చేయాలి. ఆ పాత్రలో ఎవరు చేస్తారా? అని ఎదురుచూశాను. అప్పటికే `నిన్నుకోరి`లో నివేద డ్యాన్సులు చూశాం. అందుకే ఎంపిక చేసుకున్నాం. క్లాసిక్ నేపథ్యంలో కథాంశం కాబట్టి ఈ చిత్రంలో ఎలా చేస్తారోనని అనుకున్నాం. అయితే నివేద 20 రోజులు అరుణ మేడమ్ దగ్గర డ్యాన్స్ క్లాసులకు వెళ్లారు`` అని తెలిపారు.
ఇదే వేదికపై `పొట్టోళ్లు గట్టోళ్లు అని అంటారు కదా...అలా నివేదా చాలా కష్టపడి డ్యాన్సులు నేర్చుకుంది. ఒకరోజు నేను కిటికీ నుంచి చూశాను. ఎగిరెగిరి డ్యాన్సులు చేసింది`` అంటూ నివేదపై సరదా వ్యాఖ్యను చేశారు శ్రీవిష్ణు. బ్రోచేవారెవరురా చిత్రంలో మిత్ర పాత్ర గురించి చెబుతూ.. ప్రతి అమ్మాయీ మిత్రనే. నేను కేవలం ఆడపిల్లల కోసం ఈ సినిమా చేశాను. ప్రతి అమ్మాయి ఈ సినిమాలో మిత్ర ఎదుర్కొనే తరహా సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్య ఏమిటన్నది సినిమాలో చూడండి... అని అన్నారు. సినిమా ఆద్యంతం నవ్వులు కురుస్తాయని శ్రీవిష్ణు తెలిపారు. బ్రోచేవారెవరురా ప్రీరిలీజ్ వేడుకలో అతిధులుగా పాల్గొన్న హీరోలు రామ్.. నారా రోహిత్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.