Begin typing your search above and press return to search.
ప్రేక్షకులు అందించిన విజయానికి మీడియా వారధిగా నిలిచింది: శ్రీవిష్ణు
By: Tupaki Desk | 28 Aug 2021 8:30 AM GMTటాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన 'రాజ రాజ చోర' చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల్లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా రెండో వారంలో అడుగుపెట్టింది. మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద చోరుడు మంచి కలెక్షన్స్ కొల్లగొడుతున్న నేపథ్యంలో 'రాజ రాజ చోర' చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. "రాజ రాజ చోర సినిమా కోసం టీమ్ అందరూ బాగా కష్టపడ్డారు. నిర్మాతలు మాకు పూర్తి స్వేచ్ఛ అందించడంలో మాకు సహాయం చేసారు. తెలుగు మీడియా లేకపోతే మా సినిమా లేదు. ఇంత తక్కువ సమయంలో మీరే ఈ చిత్రాన్ని జానాల్లో తీసుకెళ్లి హిట్ చేశారు. ప్రేక్షకులు అందించిన ఈ ఘన విజయానికి మీడియా వారధిగా నిలిచింది. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇది చాలా గొప్ప సినిమా. చాలా కాలం పాటు మీ గుండెల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను. మీ ఆశీస్సులు ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేస్తా'' అని అన్నారు.
'రాజ రాజ చోర' చిత్రంలో కీలక పాత్ర పోషించిన రవిబాబు మాట్లాడుతూ.. "హసిత్ గోలీ కొత్త దర్శకుడు అయినప్పటికీ ఏ క్యారక్టర్ ఎలా బిహేవ్ చేయాలో క్లారిటీతో ఉంటాడు. ఇతను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. గోలీ అంటే బుల్లెట్. అతను ఇండస్ట్రీలో బుల్లెట్ లాగా దూసుకుపోతాడు'' అని అన్నారు.