Begin typing your search above and press return to search.
ఇంట్రెస్టింగ్ గా ఇంటెన్స్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ 'అర్జున ఫల్గుణ' టీజర్..!
By: Tupaki Desk | 9 Nov 2021 6:19 AM GMTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'రాజ రాజ చోర' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీ విష్ణు.. ఇప్పుడు ''అర్జున ఫల్గుణ'' అంటూ వస్తున్నారు. ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో కూరుకు పోయాను.. అయినా బలై పోవడానికి నేను అభిమాన్యుణ్ణి కాదు.. అర్జునుణ్ణి' అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు దాని నుండి ఎలా బయటపడాలో తెలియక తప్పించుకోలేకపోయాడు. అయితే పద్మవ్యూహం గురించి అన్నీ తెలిసిన వ్యక్తి అర్జునుడు మాత్రమే. ఇప్పుడు 'అర్జున ఫల్గుణ' లో శ్రీవిష్ణు కూడా కురుక్షేత్రంలో అర్జునుడుగా కఠినమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని చెబుతున్నారు.
మన జీవితంలోని ప్రతి ప్రయాణం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ కొన్ని ప్రయాణాలు మన జీవితాలను తలకిందులు చేస్తాయి. అదే విషయాన్ని ''అర్జున ఫాల్గుణ'' టీజర్ ద్వారా చెప్పబడింది. ఇందులో డైలాగ్స్ మరియు విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. శ్రీవిష్ణు కు స్నేహితులతో సన్నిహిత బంధం.. హీరోయిన్ అమృత అయ్యర్ తో రొమాంటిక్ ట్రాక్ మరియు పోలీసులు ఛేజ్ చేసే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ వంటివి ఈ టీజర్లో చూపించబడ్డాయి.
టీజర్ చూస్తుంటే ''అర్జున ఫల్గుణ'' ఒక ఆసక్తికరమైన చిత్రమని అర్థం అవుతోంది కానీ.. కథాంశం ఎంటనేది మాత్రం గెస్ చేయలేని విధంగా టీజర్ కట్ చేశారు. శ్రీవిష్ణు ఇంటెన్స్ రోల్ లో మెప్పించారు. ఇది యువ హీరో కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుందని టీజర్ ని బట్టి అర్థం అవుతోంది. సాంకేతికంగా కూడా ఈ టీజర్ అద్భుతంగా ఉంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - శివాజీరాజా - సుబ్బరాజు - దేవి ప్రసాద్ - రంగస్థలం మహేష్ - రాజ్ కుమార్ చౌదరి ('రాజా వారు రాణి గారు' ఫేమ్) - చైతన్య ('మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్) తదితరులు కీలక పాత్రలు పోషించారు.
''అర్జున ఫల్గుణ'' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. NM పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే దర్శకుడు తేజ మార్ని అందించగా.. సుధీర్ వర్మ డైలాగ్స్ సమకూర్చారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా విప్లవ్ నైషదం ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ సుంకర యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరువుకుంటోంది. 'అర్జున ఫల్గుణ' చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.