Begin typing your search above and press return to search.

ఇంత డేరింగ్ ప్రొడ్యూసర్ ను ఇంతవరకూ చూడలేదు!

By:  Tupaki Desk   |   2 May 2022 2:30 AM GMT
ఇంత డేరింగ్ ప్రొడ్యూసర్ ను ఇంతవరకూ చూడలేదు!
X
శ్రీవిష్ణు హీరోగా 'భళా తందనాన' సినిమా రూపొందింది. వారాహి బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను 'వైజాగ్' లో నిర్వహించారు. ఈ వేదికపై శ్రీవిష్ణు మాట్లాడుతూ .. "సాధారణంగా స్టేజ్ లపై మాట్లాడటం అంటే నాకు కొంచెం టెన్షన్. కాకపోతే నేను వైజాగ్ లో పుట్టి పెరగడం వలన మన వైజాగ్ అనే ఫీలింగ్ వలన భయం లేకుండా పోయింది. అందువలన నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడేద్దామనే అనుకుంటున్నాను.

ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణం వారాహి బ్యానర్ వారు. సాయి కొర్రపాటిగారి వల్లనే ఈ సినిమా పట్టాలెక్కింది. ఇంత డేరింగ్ ప్రొడ్యూసర్ ను చూడటం ఇది ఫస్టు టైమ్. ఇదే లాస్ట్ టైమ్ కూడా అవుతుందేమో. ఎందుకంటే ఇంతకు మించి డేరింగ్ గా ఉండే నిర్మాతలను నేను ఇంతవరకూ కలవలేదు. నిర్మాత అంటేనే డేర్ ఉండాలి. అది ఆయనకి ఫుల్లుగా ఉంది. వారాహి వంటి ఒక పెద్ద బ్యానర్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆ మా టీమ్ అడిగినదానికంటే ఎక్కువగా సపోర్ట్ చేశారు.

సాయి కొర్రపాటి గారు సినిమాకి సంబంధించిన ఏ విషయంలో రాజీ పడలేదు. టీమ్ అంతా కూడా ఆయనను చూసుకుంటూ హ్యాపీగా పనిచేసుకుంటూ వెళ్లింది. దర్శకుడు చైతన్య దంతులూరి విషయానికి వస్తే ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన 'బాణం' సినిమాలోనే నేను ఫస్టు డైలాగ్ చెప్పాను. మళ్లీ ఇంత కాలానికి ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. వైజాగ్ లో నేను ఈ ఏరియాలోనే ఎక్కువగా తిరిగేవాడిని. సినిమాలు విపరీతంగా చూసేవాడిని. సినిమాలు చూడకుండా ఉన్న రోజులు చాలా తక్కువ.

ఇక్కడి ఆడియన్స్ సినిమాలను చాలా పాజిటివ్ గా తీసుకుంటారు. నేను సినిమాల్లోకి వెళ్లడానికి నన్ను ప్రోత్సహించిన ఈ వైజాగ్ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కేథరిన్ చాలా మంచి రోల్ చేసింది. ఈ సినిమా ఆమె కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇక 'గరుడ' రామ్ గారి విషయానికి వస్తే, ' కేజీఎఫ్' సినిమాతో ఆయన ఇండియాలోనే టాప్ విలన్ అయిపోయారు. నాకు విలన్ 'గరుడ' రామ్ గారు అనేది ఎవరూ ఊహించనిది. ఆయనతో ఫైట్లు ఎలా చేయాలా అని చాలా కంగారు పడిపోయాను. ఎలా చేయాలా ఏంటి అని చాలా భయపడిపోయాను. కానీ ఆయన ఎంత సాఫ్ట్ అనే విషయం ఆ తరువాత తెలిసింది" అని చెప్పుకొచ్చాడు.