Begin typing your search above and press return to search.

'రాజ రాజ చోర' ప్ర్రతి లాంగ్వేజ్ లో రీమేక్ కావడం ఖాయం: హీరో శ్రీవిష్ణు

By:  Tupaki Desk   |   16 Aug 2021 2:52 AM GMT
రాజ రాజ చోర ప్ర్రతి లాంగ్వేజ్ లో రీమేక్ కావడం ఖాయం: హీరో శ్రీవిష్ణు
X
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. హిట్ అయితే పొంగిపోవడం .. ఫ్లాప్ పడితే కుంగిపోవడం ఆయనలో కనిపించదు. తరువాత సినిమాపై దృష్టిపెట్టేసి, దానిని ముందు తీసుకువెళ్లాలనే ఆలోచనలోనే ఉంటాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రాజ రాజ చోర' సినిమాను, ఈ నెల 19వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై శ్రీ విష్ణు మాట్లాడాడు.

"ఇక్కడ వాతావరణం చాలా కూల్ గా .. ఫ్యామిలీ గెట్ టు గెదర్ లా ఉంది .. నాకు బాగా నచ్చింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే, హసిత్ నాకు పాయింట్ చెప్పడం .. ఆ తరువాత అది విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ దగ్గరికి చేరడం జరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నేను హసిత్ కలిసి ట్రావెల్ చేస్తున్నాము. షూటింగ్ మొదలుపెట్టిన పది .. పదిహేను రోజులకు ఫస్టు లాక్ డౌన్ పడింది. దాంతో ఆరేడు నెలల పాటు కథ గురించి మాట్లాడుకోవడమే తప్ప ఏమీ చేయలేకపోయాము. మరోసారి లాక్ డౌన్ వంటివి రాకూడదని కోరుకుంటున్నాను.


వివేక్ సాగర్ ఈ సినిమాకి మంచి సంగీతంతో పాటు అంతకు మించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. కెమెరా మెన్ వేద రామన్ తో నేను గతంలో 'మెంటల్ మదిలో' సినిమాను చేశాను. విజువల్స్ పరంగా ఈ సినిమాను ఆయన మరోస్థాయికి తీసుకెళ్లాడు. హసిత్ గోలి గతంలో బిట్స్ పిలాని స్టూడెంట్ .. మంచి శాలరీ వచ్చే జాబ్ వదిలేసి సినిమాల వైపు వచ్చాడు. అంతేకాదు మొదటిసారి మాట్లాడిన వెంటనే నాకు కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమాతో హసిత్ పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన దర్శకత్వంలో మళ్లీ మళ్లీ చేయాలని ఉంది.

ఈ సినిమాను చూడటానికి మీరంతా థియేటర్లకు వెళ్లండి .. కాకపోతే మూడు మాస్కులు తెలుకుని వెళ్లండి. ఎందుకంటే సినిమాలో నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది కనుక, నవుతున్నప్పుడు మాస్కులు ఎగిరిపోతూ ఉంటాయి. ఈ సినిమా  చూస్తుంటే మీకు ఒక కొత్త లోకంలోకి వెళ్లినట్టుగా ఉంటుంది. ఈ సినిమాలో చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాను ప్రతి లాంగ్వేజ్ లోను రీమేక్ చేస్తారు .. మీరు నోట్ చేసుకోండి. అంతటి కొత్తదనం ఈ కథలో కనిపిస్తుంది. ఈ సినిమాతో హసిత్ గోలి ఇమేజ్ పెరిగిపోవడం ఖాయం.

ఈ సినిమా ఫస్టాఫ్ లో ఎంత ఎంటర్టైన్ మెంట్ ఉంటుందో .. సెకాండాఫ్ లో అంతటి ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. నేను వెంకటేశ్ గారి అభిమానిని ..  ఆయన 'నారప్ప' థియేటర్లలో రానందుకు బాధపడినవాళ్లలో నేను ఒకడిని. గతంలో వెంకటేశ్ చేసిన తరహాలోనే ఈ కథ నడుస్తుంది అందువలన వెంకటేశ్ అభిమానులతో పాటు, అందరి హీరోల అభిమానులు థియేటర్లకు వచ్చి ఈ చిన్న సినిమాను ఆశీర్వదించాలి" అని చెప్పుకొచ్చాడు.