Begin typing your search above and press return to search.

గుండు - ఒళ్లంతా టాటూలతో ఈ హీరో

By:  Tupaki Desk   |   10 July 2018 7:15 AM GMT
గుండు - ఒళ్లంతా టాటూలతో ఈ హీరో
X
కొత్త దర్శకుడు ఇంద్ర ముగ్గురు హీరోలను పెట్టి వినూత్న కథతో సినిమా తీస్తున్నాడు. ‘వీరభోగ వసంతరాయలు’ అనే టైటిల్ తో తీస్తున్న ఈ మూవీలో నారా రోహిత్ - సుధీర్ బాబు - శ్రీవిష్ణు హీరోలు.. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

మొదటి నుంచి డిఫెరెంట్ సినిమాలతో ముందుకు వస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. హీరో అంటే ఇలాంటి పాత్రలే చేయాలనే దానికి ఫూర్తి భిన్నంగా ముందుకెళుతున్నాడు విష్ణు. అందుకే ఈసారి ఈ కొత్త సినిమా కోసం వినూత్నంగా ట్రై చేస్తున్నాడట..

శ్రీవిష్ణు ఈ సినిమాలో గుండుతో ఒళ్లంతా టాటూలతో కనిపిస్తాడట.. ఒకసారి గుబురు జుట్టుతో కనిపిస్తాడట.. సినిమా మొత్తానికి కీలకమైన ఈ పాత్రను విష్ణు ప్రాణం పెట్టి చేశాడని..హీరో అయ్యి కూడా ఇలా వింతైన నెగెటివ్ పాత్రలో జీవించేశాడని తెలిసింది. మరి పూర్తి థ్రిల్లర్ గా తయారవుతున్న ఈ సినిమాను త్వరలోనే జనం ముందుకు తీసుకురావడానికి దర్శకుడు ఇంద్ర ప్రయత్నాలు చేస్తున్నారు.