Begin typing your search above and press return to search.
మా సినిమాకు రావొద్దని పిలుపు ఇచ్చారు
By: Tupaki Desk | 22 March 2018 2:15 PM GMTదయచేసి మా సినిమాకు రావొద్దు అంటూ ఒక వర్గం జనాలకు ఏ చిత్ర మేకర్స్ అయినా పిలుపు ఇస్తారా..? కానీ ‘నీదీ నాదీ ఒకే కథ’ టీం మాత్రం అదే పని చేసింది. ‘‘మేధావులు.. పక్కన వాళ్ళ పనిని.. పనితనాన్ని చులకనగా చూసేవారు దయ చేసి మా సినిమాకు రాకండి’’ అంటూ ఈ చిత్ర యూనిట్ వెరైటీ అప్పీల్ ఇవ్వడం విశేషం.
దీనికి కొనసాగింపుగా ‘‘ఇది కేవలం మాకు.. మాలాంటి వాళ్లకు సంబంధించిన కథ. ఏమాత్రపు హీరో ఇంట్రడక్షన్లు.. ఇంటర్వెల్ ట్విస్టులు.. క్లైమాక్స్ ఫైట్లు.. ఆఖరికి రాహుల్ ద్రవిడ్ యాడ్ కూడా లేని ఒక సామాన్యుడి కథ. ఇది మా కథ.. మీ కథ.. మీది మాది ఒకే కథ’’ అంటూ ఈ రోజు ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. ముందు నుంచి ఈ చిత్రాన్ని ఇలాగే వెరైటీగానే ప్రమోట్ చేస్తున్నారు.
చదువు సరిగా అబ్బకుండా.. సమయానికి ఉద్యోగం తెచ్చుకోకుండా అప్రయోజకుడిగా ముద్ర వేసుకున్న కుర్రాడి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వేణు ఉడుగుల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించాడు. సనా టైటస్ కథానాయిక. ఇంతకుముందు శ్రీవిష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను నిర్మించిన ప్రశాంతి.. కృష్ణవిజయ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. దీనికి నారా రోహిత్ సమర్పకుడు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.