Begin typing your search above and press return to search.
నీది నాది ఒకే కథ.. రిలీజ్ డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 11 March 2018 5:12 AM GMTపెద్ద బ్యాగ్రౌండేమీ లేకుండానే నటుడిగా సత్తా చాటుకుని హీరోగా స్థిరపడే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీవిష్ణు. మొదట్నుంచి క్యారెక్టర్ రోల్సే చేస్తూ వచ్చిన అతను ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. గత ఏడాది ‘మెంటల్ మదితో’నూ మరోసారి ఆకట్టుకున్నాడు శ్రీవిష్ణు. అతడి కొత్త సినిమా ‘నీది నాది ఒకే కథ’ కూడా ఆసక్తికర ప్రోమోలతో మొదట్నుంచి జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మార్చి 23న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించారు. ఆ రోజు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎమ్మెల్యే’ రిలీజయ్యేట్లున్నప్పటికీ ‘నీది నాది ఒకే కథ’ను కూడా రేసులో దించడానికే నిర్ణయించారు.
ర్యాంకులు సాధించినోడే గొప్ప విద్యార్థి.. ఉద్యోగం సాధించినవాడే ప్రయోజకుడే అనుకునే సమాజం తీరును ప్రశ్నిస్తూ తెరకెక్కిన సినిమా ‘నీది నాది ఒకే కథ’. ఈ చిత్రంలో వేణు ఉడుగుల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఆలోచన రేకెత్తించే ప్రోమోలతో ఈ సినిమా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఒక చర్చను లేవనెత్తింది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు రుద్రరాజు సాగర్ అనే పాత్రలో నటిస్తున్నాడు. టీజర్లో రాయలసీమ స్లాంగ్ లో అతడి డైలాగులు ఆసక్తి రేకెత్తించాయి. ‘బిచ్చగాడు’ ఫేమ్ సనా టైటస్ ఇందులో కథానాయికగా నటించింది. శ్రీవిష్ణు స్నేహితుడు.. నటుడు నారా రోహిత్ సమర్పణలో.. శ్రీవిష్ణు భార్య ప్రశాంతి.. ‘అసుర’ దర్శకుడు కృష్ణ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ను కూడా వీళ్లే నిర్మించారు.