Begin typing your search above and press return to search.

ఓటీటీకి ‘శ్రీకారం’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   15 April 2021 6:49 AM GMT
ఓటీటీకి ‘శ్రీకారం’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
X
యువ‌న‌టుడు శ‌ర్వానంద్ తాజా చిత్రం ‘శ్రీకారం’. శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆధునిక వ్య‌వ‌సాయం బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వాస్త‌వాల‌కు కాస్త దూరంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

శివ‌రాత్రి టార్గెట్ గా.. మ‌రో రెండు చిత్రాల‌తో పోటీ ప‌డి రిలీజ్ అయ్యిందీ చిత్రం. జాతిర‌త్నాలు, గాలి సంప‌త్ సినిమాలు కూడా మార్చి 11వ తేదీనే రిలీజ్ అయ్యాయి. ఇందులో గాలి సంప‌త్ తేలిపోగా.. జాతిర‌త్నాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ కార‌ణంగానే.. పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. శ్రీకారం నిల‌బ‌డ‌లేక‌పోయింది.

ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు మేక‌ర్స్‌. రేప‌టి నుంచి (ఏప్రిల్ 16) నుంచి స‌న్ నెక్స్ట్ యాప్ లో శ్రీకారం మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ పై స‌త్తా చాట‌లేక‌పోయినా.. బుల్లితెర‌పై దుమ్ములేపుతుంటాయి. మ‌రి, శ్రీకారం ఎలాంటి రికార్డు న‌మోదు చేస్తుందో చూడాలి.