Begin typing your search above and press return to search.
వీడియో: భలే బాగున్న 'శ్రీకారం' చిత్రంలోని 'భలేగుంది బాలా' సాంగ్..!
By: Tupaki Desk | 9 Nov 2020 4:00 PM GMTయువ హీరో శర్వానంద్ - ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ''శ్రీకారం''. కిశోర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'శ్రీకారం' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'భలేగుంది బాలా' ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేశారు. 'వచ్చానంటివో.. పోతానంటివో.. వగలు పలుకుతావే.. కట్టమీద పోయే అలకల సిలికా.. భలేగుంది బాలా..' అంటూ సాగిన ఈ పాటను రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ ఆలపించారు. ఈ పాటకి ఆయనే సాహిత్యాన్ని అందించడం విశేషం.
'అరెరే.. నారి నారి వయ్యారి సుందరి.. నవ్వు మొహం దానా.. నీ నవ్వు మొహం మీద నంగనాచి అలక భలేగుంది బాలా..' అంటూ పెంచల్ దాస్ పల్లెటూరి యాసలో తనదైన శైలిలో పాడారు. 'తిక్కరేగి ఎక్కినావే కోమలి అలక నులక మంచం.. అలసందా గువ్వా నీకు అగుడు సేయు తగునా' అంటూ సాగే ఈ పాట అలిగిన ప్రేయసిని ప్రియుడు బుజ్జిగిస్తున్న నేపథ్యంలో వస్తుందని తెలుస్తోంది. ఈ సాంగ్ లో శర్వానంద్ లుంగీ కట్టుకొని పల్లెటూరి యువకుడిగా కనిపిస్తుండగా.. ప్రియాంక మోహన్ లంగావోణీ లో పల్లెటూరి అమ్మాయిలాన అందంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టు బాణీలు అందించాడు. భలేగుంది బాలా పాటకు దినేష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. కాగా, కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళి శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.