Begin typing your search above and press return to search.

శ్రీలీల జోరు.. వాళ్ళు సర్దుకునేలా ఉన్నారు

By:  Tupaki Desk   |   17 Jan 2023 2:30 AM GMT
శ్రీలీల జోరు.. వాళ్ళు సర్దుకునేలా ఉన్నారు
X
పెళ్లి సంద-డి సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన హీరోయిన్ శ్రీలీల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా బాగా ఆడడానికి కారణం మాత్రం హీరోహీరోయిన్లే. కన్నడ అమ్మాయి అయిన శ్రీలీల తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆమెను చూసేందుకు చాలా మంది థియేటర్లకు వెళ్లారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తోనే ఆమె తెలుగులో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

హీరో రవితేజ సరసన చేసిన ధమాకా సినిమా గతేడాది చివర్లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరుసగా రెండు సినిమాలు సక్సెస్ అవడంతో శ్రీలీలకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మిల్క్ బాయ్ చేస్తున్న సినిమాలో శ్రీలీల ఓ కథానాయికగా ఎంపిక అయింది. ఈ సినిమాలో శ్రీలీల ఉందా లేదా అనే విషయంలో ఇటీవల సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో శ్రీలీల ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శ్రీలీల రెండో హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలపై నాగవంశీ స్పందించారు. తాము హీరోయిన్లకు నంబరింగ్ అంటూ ఏమీ ఇవ్వలేదని.. శ్రీలీలను సెకండ్ హీరోయిన్ అనడం కరెక్ట్ కాదని చెప్పారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న మహేష్ సినిమాలో శ్రీలీల కూడా ఓ హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మూడో సినిమాకే మహేశ్ సరసన ఛాన్స్ కొట్టేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ గురించి తెలుస్తోంది. పైగా నాగవంశీ మాటల్ని బట్టి చూస్తే.. శ్రీలీలకు ముఖ్యమైన పాత్ర ఇచ్చినట్లు అర్థం అవుతోంది.

అలాగే ఎన్టీఆర్ 30 సినిమాలో కూడా శ్రీలీలకు ఛాన్స్ వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి.. ఎన్టీఆర్ 30లో కూడా ఈ అమ్మడు నిజంగానే ఛాన్స్ దక్కించుకంటే.. శ్రీలీల రేంజ్ విపరీతంగా పెరిగిపోతుంది. మంచి మంచి ఛాన్సులతో శ్రీలీల ఇలాగే సాగిపోతే ఇక రష్మిక మందన్నా, పూజా హెగ్డేలు సర్దుకొని వెళ్లిపోవాల్సిందేనని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.