Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పూల గౌనులో పాప ఎంత ముద్దొచ్చేస్తోందో!

By:  Tupaki Desk   |   9 Feb 2023 12:00 PM GMT
ఫోటో స్టోరి: పూల గౌనులో పాప ఎంత ముద్దొచ్చేస్తోందో!
X
శ్రీ లీల .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఈ బ్యూటీ కన్నడ-తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. AP అర్జున్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం 'కిస్'తో క‌న్న‌డ‌ పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రీ‌లీల కె.రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన పెళ్లిసంద‌-డి చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌య‌మైంది.

శ్రీ లీల సినీ ఆరంగేట్రం ఊహించ‌ని రీతిలో సాగింది. నిజానికి ఆచారం సాంప్ర‌దాయాలు అంటూ మడి ఆచారాల‌ను అనుస‌రించే సనాతన కుటుంబం నుండి వచ్చిన ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ నటవృత్తిలో ప్ర‌వేశించ‌డానికి ఇంట్లో అనుమతి పొందడంలో మొదట్లో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాన‌ని తెలిపింది. ఆరంభం వైద్యురాలైన తన తల్లి అడుగుజాడల్లో నడుస్తూ మెడికల్ డిగ్రీని కొనసాగిస్తోంది. మ‌రోవైపు క‌న్న‌డ‌లో సాటి స్టార్లు రాధికా పండిట్ -యష్ లతో సన్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవ‌కాశాలు రావ‌డం చాలా సులువైంది. రాధికా పండిట్ ని అక్కా అని... య‌ష్ ని జీజు అని పిలిచేంత చ‌నువు శ్రీ‌లీల‌కు ఉంది.

కిస్ అనే చిత్రం శ్రీ‌లీల‌కు అధికారిక తొలి చిత్రం. 20 మైన‌స్ ఏజ్ లోనే శ్రీ లీల తన నటనా నైపుణ్యం ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పరిశ్రమలో త‌న‌దైన‌ ముద్ర వేసింది. క‌న్న‌డ‌లో తర్వాత శ్రీమురళి సరసన 'భారతే' అనే చిత్రంలో నటించింది.

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీకాంత్ వార‌సుడు రోష‌న్ స‌ర‌స‌న పెళ్లిసంద‌-డి చిత్రంతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన శ్రీ‌లీల యువ‌త‌రం మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. త‌న‌దైన న‌ట‌న ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌కు తెలుగు యువ‌త ఫిదా అయిపోయారు. ఆ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ధ‌మాకా చిత్రంతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకుంది. టాలీవుడ్ లో ఎదురే లేని క‌థానాయిక‌గా శ్రీ‌లీల 22 ఏళ్ల వయ‌సులోనే దూసుకుపోతోంది. శ్రీ‌లీల ప్ర‌తిభ‌కు మెస్మరైజ్ అయిన మీడియా సైతం అప్ కమ్ స్టార్ హీరోయిన్ అంటూ ప్ర‌చారం హోరెత్తిస్తోంది.

శ్రీ‌లీల ప్ర‌స్తుత లైన‌ప్ విస్త్ర‌తంగా ఉంది. ర‌వితేజ 'ధమాకా'తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.... త్రివిక్రమ్ దర్శకత్వంలో సూప‌ర్ స్టార్ మహేష్ బాబు స‌ర‌స‌న ఎస్.ఎస్.ఎం.బి 28 కి సంతకం చేసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ చిత్రంలోను ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తోంద‌ని స‌మాచారం.

స్వ‌గ‌తంలోకి వెళితే ..!

శ్రీలీల వ్య‌క్తిగత విషయాల్లోకి వెళితే...చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. శ్రీలీల అమెరికా-మిచిగాన్ లోని డెట్రాయిట్ లో స్ట‌డీస్ కొన‌సాగించింది. త‌నో ఎన్నారై గాళ్. కన్నడ చిత్రం కిస్ లో న‌టించి క‌థానాయిక అయ్యింది. శ్రీలీల హిందూ కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు అప్ డేట్ లు అందించ‌డంలో స్పీడ్ గా ఉంటుంది. శ్రీ‌లీల వ్యక్తిగత ఆస‌క్తుల‌ను ప‌రిశీలిస్తే.. శ్రీలీల జంతు ప్రేమికురాలు. మూగ‌జీవాల‌ను అమితంగా ప్రేమిస్తుంది. త‌న ఇంట్లో పెట్ డాగ్స్.. పిల్లులను ప్రేమించి పోషిస్తోంది. సినిమాలు చూడటం .. సుదూర తీరాల‌కు ప్రయాణించడం శ్రీ‌లీల హాబీస్.

ఇన్ స్టా మాధ్య‌మంలో శ్రీ‌లీల ఇత‌ర భామ‌ల కంటే స్పీడ్ గా ఉంటుంది.
తాజాగా శ్రీ‌లీల షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోషూట్ కి ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాల‌తో యువ‌త‌రం కామెంట్ల‌తో చెల‌రేగుతోంది. ఫ్లోర‌ల్ డిజైన‌ర్ గౌన్ లో శ్రీ‌లీల టూ హాట్ గా ఉందంటూ అభిమానులు కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు. పూల గౌనులో పాప ఎంత ముద్దొచ్చేస్తోందో! అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ వెబ్ లో దూసుకుపోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.