Begin typing your search above and press return to search.
BBS3: పోలీసులను ఆశ్రయించిన శ్రీముఖి బ్రదర్
By: Tupaki Desk | 30 Aug 2019 9:50 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 3 చాలా నీరసంగా సాగుతోంది. మొదటి వారంలో రికార్డు స్థాయి రేటింగ్ అందుకున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రెండవ వారం నుండి రేటింగ్ దారుణంగా పడిపోతూ వస్తోంది. మొదటి వారంలో వచ్చిన రేటింగ్ లో ప్రస్తుతం సగం కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్ పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి సభ్యుల మద్య గొడవలు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకానొక సందర్బంగా రాహుల్ ను శ్రీముఖి 'బ్లాక్ షీప్' అంటూ సంబోధించింది.
శ్రీముఖి వ్యాఖ్యలపై విమర్శలు మొదలయ్యాయి. సీజన్ 3 లో బలమైన కంటెస్టెంట్.. ఫైనల్ వరకు వెళ్లగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ అంటే శ్రీముఖి అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. అలాంటి శ్రీముఖిపై ప్రస్తుతం వస్తున్న కమెంట్స్ తీవ్ర దుమారంను రేపుతున్నాయి. వర్ణ వివక్ష కామెంట్స్ చేసింది అంటూ శ్రీముఖిపై కొందరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో ఒక ఆంగ్ల పేపర్ లో వరుసగా శ్రీముఖి గురించిన కథనాలు వస్తున్నాయి. ఆమె జాతి వివక్ష.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిందని ఆ పేపర్ లో కథనాలు వస్తున్న నేపథ్యంలో తన సోదరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు సదరు పేపర్ కుట్ర పన్నిందంటూ శుష్రుత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీముఖి సోదరుడు శుష్రుత్ తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సదరు మీడియా సంస్థపై అలాగే సోషల్ మీడియాలో శ్రీముఖిపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశాడు. శుష్రుత్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టినట్లుగా తెలియజేశారు. మొదట తన సోదరిపై వస్తున్న వార్తలను లైట్ తీసుకున్నామని.. కాని వారు పదే పదే శ్రీముఖి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వార్తలు రాస్తుండటంతో ఫిర్యాదు చేయక తప్పలేదని శుష్రుత్ అన్నాడు. పెద్దగా వివాదాలు లేకుండా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 3 మెల్ల మెల్లగా వివాదాస్పదం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వివాదం కారణం అయినా రేటింగ్ పెరిగేనో చూడాలి.