Begin typing your search above and press return to search.
శ్రీముఖిని కలవటమే కాదు..మాట్లాడాలంటే..ఇలా చేయాలట!
By: Tupaki Desk | 7 Feb 2020 1:30 AM GMTకోట్లాది మందికి రాని ఇమేజ్ కొందరి సొంతమవుతుంది. కలలు కన్న స్టార్ డమ్ సొంతమయ్యాక.. అదో సమస్యగా మారుతుంటుంది. యాంకర్ కమ్ బిగ్ బాస్ ఫైనలిస్టు శ్రీముఖి ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోదట. ఆమె కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెయిట్ చేయటం.. ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఇంటికి రావటాన్ని ఆమె తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు.
ఇందులో భాగంగా కొందరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి తమతో ఫోటోలు దిగాలని కోరటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆమె తాజాగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. మీరంటే మాకిష్టమని ఎక్కడెక్కడినుంచో తమ ఇంటికి వస్తున్నారని.. అలాంటి వారు సమయం.. సందర్భం చూసుకోకుండా రావటం ఇబ్బందిగా మారినట్లు చెప్పారు.
తమను ప్రేమించి.. అభిమానించే అభిమానులు ఉండటం నిజంగానే లక్కీ అని.. అలాంటి అభిమానుల కోసమే తాము మేకప్ లు వేసుకొని టీవీ ముందుకు వచ్చి అలరిస్తున్నట్లు చెప్పారు. తమకు ఇంతటి పేరు వచ్చేది అభిమానుల వల్లనేనని చెబుతూ.. అయినప్పటికీ అన్నింటికి ప్రొసీజర్లు ఉన్నట్లే.. తనను కలిసే అభిమానులకు ఆమె ఒక ప్రొసీజర్ ను చెప్పుకొచ్చారు.
అభిమానుల్ని కలిసేందుకు తనకు అభ్యంతరం లేదని.. కాకుంటే సరైన సమాచారం అందించి వస్తే బాగుంటుందని.. అలా కాకుండా వేళ కాని వేళల్లో తమ వద్దకు వచ్చేసి ఫోటోలు దిగుతామంటే ఇబ్బంది చెబుతోంది. టైం తీసుకొని వస్తే.. ఫోటోలు ఏమిటి? కాసేపు మాట్లాడుకోవచ్చు కూడా అంటూ తన బాధను చెప్పుకొచ్చారు శ్రీముఖి. తను అందరికి తెలుసని.. కానీ తనకు అందరూ తెలీదని.. అందుకే తన అసిస్టెంట్స్ కు సమాచారం ఇచ్చి వస్తే.. కలిసేందుకు అభ్యంతరం లేదని చెప్పింది.
తాను ఒక టెలివిజన్ షో కోసం పని చేస్తున్నానని.. ఒక్క రోజులోనే మూడు ఎపిసోడ్లు చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి మూడు గంటలైందని.. మళ్లీ ఉదయమే నిద్ర లేచి షూటింగ్ కు వచ్చేశానని.. తానెంత బిజీగా ఉన్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. నిత్యం ఒత్తిడితో ఉండటం.. కొన్ని సందర్భాల్లో మానసిక స్థితి సరిగా లేని వేళలో.. వచ్చి మీతో ఫోటోలు దిగుతామంటే ఇబ్బంది ఉండదా? అని ప్రశ్నిస్తుంది. నిజమైన అభిమానులే అయినప్పటికీ.. తనకూ ప్రైవసీ ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ సున్నితంగా తన ఇబ్బంది చెబుతూనే.. అభిమానులకు భారీ క్లాస్ పీకింది శ్రీముఖి.