Begin typing your search above and press return to search.

తమ్ముడికి ఖరీదైన బహుమానం ఇచ్చిన రాములమ్మ

By:  Tupaki Desk   |   10 Oct 2021 2:30 PM GMT
తమ్ముడికి ఖరీదైన బహుమానం ఇచ్చిన రాములమ్మ
X
బుల్లి తెరపై తనదైన శైలిలో దూసుకు వెళ్లడమే కాకుండా వెండి తెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూ వస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. యాంకర్ ల్లో సుమ తర్వాత శ్రీముఖికి అంతటి గుర్తింపు ఉంది అనడంలో సందేహం లేదు. అన్ని ఛానల్స్ లో కూడా శ్రీముఖి కనిపిస్తూ ఉంటుంది. సంపాదన విషయంలో శ్రీముఖి టాప్ లో ఉంటుందనే టాక్ ఉంది. సుమ తర్వాత శ్రీముఖి అత్యధికంగా పారితోషికం అందుకోవడంతో పాటు అత్యధిక షో లు చేస్తున్న యాంకర్ గా కూడా పేరు దక్కించుకుంది. రాములమ్మగా సుపరిచితురాలు అయిన శ్రీముఖి తన తమ్ముడు సుష్రుత్‌ కోసం రెగ్యులర్‌ గా ఏదో ఒక గిప్ట్ ను ఇచ్చి సర్‌ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఏకంగా ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చింది.

తమ్ముడు సుష్రుత్‌ కు ఫోర్డ్‌ కారును బహుమానంగా ఇవ్వడం ద్వారా శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తమ్ముడు అంటే అత్యంత ఇష్టంగా ఎక్కువ వీడియోల్లో శ్రీముఖి చెబుతూనే ఉంటుంది. అతడు కూడా శ్రీముఖి వీడియోల నుండి మొదలుకుని అన్ని విషయాల్లో కూడా అండగా నిలుస్తూ ఉంటాడు. అందుకే తమ్ముడి కోసం ఈసారి ఫోర్డ్‌ కారును కొనుగోలు చేసి ఇచ్చేసింది. తమ్ముడికి ఇష్టమైన ఫోర్ట్‌ కారును కొనుగోలు చేసిన శ్రీముఖి అతడికి బహుమానంగా ఇవ్వడంతో అతడి కళ్లలో ఆనందం కనిపించింది. అదే సమయంలో తమ్ముడి కోసం బహుమానం ఇవ్వడం పట్ల శ్రీముఖి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

సోషల్‌ మీడియాలో సుష్రుత్‌ కు అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీముఖి వంటి అక్క ఉండటం అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం భారత్ లో ఫోర్డ్‌ తమ కార్యకళాపాలను ఆపేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆ కారు ఎందుకు తీసుకున్నావు రాములమ్మ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం అతడికి ఇష్టమైనది ఇచ్చినందుకు అభినందనలు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో రాములమ్మ కొత్త కారు బహుమానంకు సంబంధించిన వార్తలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.