Begin typing your search above and press return to search.
ఉల్లిపొర చీరలో ఊహాసుందరిలా శ్రీముఖి!
By: Tupaki Desk | 23 March 2021 11:30 PM GMTశ్రీముఖి అనే మూడు అక్షరాలు పేరు కాదు .. మధురమైన మంత్రం అంటారు కుర్రాళ్లు. శ్రీముఖి అంటే అందం .. అల్లరితనం అని చెబుతారు. చిలిపితనానికి ఆమె చిరునామా .. కొంటెదనానికి వీలునామా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. బుల్లితెరపై ఆటపాటలతో .. అరుపులతో సందడి చేసే శ్రీముఖికి భారీసంఖ్యలో అభిమానులు ఉన్నారు. షో ఏదైనా .. కాన్సెప్ట్ ఏదైనా శ్రీముఖి కోసం టీవీల ముందు కూర్చునే వాళ్లే ఎక్కువ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాకెట్ లా రేటింగ్ దూసుకుపోయేలా చేయగల గ్లామర్ శ్రీముఖి సొంతం. అందువల్లనే బుల్లితెర క్యాంపస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఆమెకి ఎదురులేదు .. తిరుగులేదు.
నిజం చెప్పాలంటే శ్రీముఖిని బుల్లితెరపై చూసిన వాళ్లంతా కూడా ఈ అమ్మాయికి హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అనుకున్నారు. మోడల్ గా కూడా బాగా రాణించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకో ఇటు సినిమాలపై .. అటు మోడలింగ్ పై శ్రీముఖి పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. కానీ ఇటీవలే చూస్తే ఆమె ఆలోచనా విధానంలో చాలావరకూ మార్పు వచ్చిందనే విషయం మాత్రం అర్థమవుతోంది. శ్రీముఖి హెయిర్ స్టైల్ .. ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో చాలా మార్పు వచ్చిది. సొగసుల ఆరబోత విషయంలో కొన్ని సడలింపులు తెచ్చింది. కూల్ గా హాట్ ఫొటోలను వదులుతూ, ఇన్ స్టా చుట్టూ కుర్రాళ్లను తిప్పేస్తోంది.
తాజాగా సంధించిన ఫొటోలో శ్రీముఖి గోల్డ్ ఎండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోని చీరకట్టులో మెరిసింది. తనని తాను మరిచిపోయి తన్మయత్వాన్ని పొందుతున్నట్టుగా .. అజంతా శిల్పంలా ఒక పోజు ఇచ్చింది. ఉల్లిపొరలాంటి చీరలో ఊహాసుందరిలా ఊరిస్తోంది. ఆకలి - దాహం మరిచిపోయేలా చేసే అందం వేరు .. అసలు ఊపిరి తీసుకోవడమే మరిచిపోయే సౌందర్యం వేరు. రెండవ వర్గానికి చెందిన సొగసుల సంపెంగలా ఇక్కడ శ్రీముఖి కనిపిస్తోంది. అందాలతో ఆమె చేస్తున్న అల్లరి చూస్తుంటే, వెండితెరపై దూకుడు పెంచేలానే అనిపిస్తోంది.