Begin typing your search above and press return to search.
మంచి బ్యాడ్ మూవీ లో యాంకర్
By: Tupaki Desk | 16 Aug 2017 5:23 AM GMTసినిమా పరిశ్రమలోకి ఎదో ఒక రంగంలో టాలెంట్ చూపించాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ అవ్వాలనే కోరికతో వచ్చే వారు ఎంతో కస్టపడతారు. అలాగే మధ్య మధ్యలో నటుడిగా ఏమైనా ఛాన్సులు వస్తే గుర్తింపు కోసం ఒకే చెప్పేసి వారి స్టైల్ లో నటించి నటుడిగా బిజీ అయిపోతు ఉంటారు. అలాంటి వారిలో హర్ష వర్ధన్ ఒకరు.
అమృతం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సూపరిచితుడైన హర్షవర్ధన్ తర్వాత విశాఖ ఎక్స్ ప్రెస్ ద్వారా మాటల రచయిత గా మొదటి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక "గుండెజారి గల్లంతయ్యిందే" సినిమాలో కూడా మాటలను అందించి ఆకట్టుకొని కథనం లో కూడా కాస్త సహకారాన్ని అందించారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ "మనం" సినిమాకు కూడా మాటలను అందించి మంచి పేరు తెచ్చుకున్న అతను ఇప్పుడు దర్శకుడిగా మారిపోతున్నాడు.
1980 బ్యాక్ డ్రాప్ లో ఉండే ఓ కొత్త తరహా కథతో రాబోతున్నాడు. అంతే కాకుండా టైటిల్ కూడా చాలా కొత్తగా పెట్టాడు. గుడ్–బ్యాడ్ అండ్ అగ్లీ అనే టైటిల్ తో శ్రీ ముఖిని ప్రధాన పాత్ర దారిగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించానున్నడట. శ్రీ ముఖిని ఈ సినిమాలో ఎంచుకోవడానికి ఓ కారణం ఉందట. కథలో ఒక పాత్రకు కొన్ని విభిన్నమైన షేడ్స్ ఉండాలట. అలాగే గ్లామర్ గర్ల్ గాను మరియు ట్రెడిషనల్ అమ్మాయిగాను అలాగే గల గల మాట్లాడే తీరును కలిగి ఉండాలట. దీంతో ఈ కథకు కరెక్ట్ గా శ్రీ ముఖి అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను కథానాయికగా ఎంచుకున్నాడట ఈ నవ దర్శకుడు.