Begin typing your search above and press return to search.
భావోద్వేగానికి పోయి రూ.20 లక్షలు పోగొట్టుకున్న శ్రీరామచంద్ర
By: Tupaki Desk | 20 Dec 2021 10:30 AM GMTఅందరి అంచనాలు ఏ మాత్రం తగ్గని రీతిలో బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ నిలిచాడు. టాప్ 5 కాస్తా.. టాప్ 3 అయ్యేసరికి.. బరిలో సన్నీ.. షణ్ను.. శ్రీరామచంద్రలు నిలిచారు. ఆ సందర్భంగా బిగ్ బాస్ ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
బరిలో ఉన్న ముగ్గురిలో ఎవరైనా తమకు తాము బయటకు వచ్చేసిన పక్షంలో గోల్డెన్ బాక్సులో ఉన్న భారీ మొత్తాన్ని ఇచ్చేస్తామని ప్రకటించారు. ఆ సందర్భంగా సింగర్ శ్రీరామచంద్ర కాస్తంత ప్రాక్టికల్ గా ఆలోచించినా.. భారీ మొత్తం మిగిలేది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇచ్చే డబ్బులతో పాటు.. ఈ అదనపు మొత్తాన్ని ఆయన సొంతం చేసుకునేవారు.
బిగ్ బాస్ 5 విజేతగా నిలవటానికి శ్రీరామచంద్రకు ఉన్న అవకాశాలు చాలా చాలా తక్కువ. అలాంటి వేళ.. టాప్ 3లో నిలిచి.. టైటిట్ పోటీ నుంచి తనకు తాను తప్పుకొని ఉంటే రూ.20లక్షల మొత్తాన్ని ఇస్తామని పేర్కొన్నారు. దానికి ముందు సిల్వర్ బాక్సులో కొంత మొత్తాన్ని తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ హీరో నాని ప్రపోజల్ ను వద్దని చెప్పారు హౌస్ మేట్స్. ఆ సందర్భంగా మానస్ ఎవిక్ట్ అయితే.. టాప్ త్రీలో భారీ నజరానాను వదులుకున్నారు శ్రీరామ చంద్ర.
బిగ్ బాస్ 5లో తన తోటి కంటెస్టెంట్ అయిన హమీదా మీద తనకున్న ప్రేమాభిమానాల్ని అప్పుడప్పుడు ప్రకటించే శ్రీరామచంద్ర.. గ్రాండ్ ఫినాలే వేళ.. శ్రీరామచంద్ర.. హమీదాకు సంబంధించి కొన్ని సీన్లు అందరిని ఆకట్టుకునేలా సాగాయి. అంతేకాదు.. శ్రీరామచంద్ర ఎవిక్ట్ అయినట్లుగా ప్రకటించిన వెంటనే.. హమీదా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ నిర్ణయాన్ని ఊహించలేనట్లుగా శ్రీరామ చంద్ర తల్లిదండ్రుల స్పందన ఉండటం గమనార్హం.
నిజానికి టాప్ త్రీలో ఉన్న వేళ.. ఎమోషన్ ను కాస్తంత పక్కన పెట్టేసి.. ప్రాక్టికల్ గా ఆలోచించి చూస్తే.. శ్రీరామచంద్రకు అవకాశాలు తక్కువ. దానికి మొదటి కారణం.. ఇప్పటికే ఇండియన్ ఐడల్ విజేతగా నిలవటం. ఒక రియాలిటీ షోలో విజేతగా నిలిచి.. మరో రియాలిటీ షోలో టైటిల్ విన్నర్ గా గెలిచే అవకాశాలు దాదాపుగా ఉండవు.
ఈ చిన్న లాజిక్ ను శ్రీరామచంద్ర గుర్తించి ఉండి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. అయితే.. తాము డబ్బు కంటే కూడా ప్రేక్షకుల ఓట్లకే ప్రాధాన్యత ఇస్తామని.. డబ్బులు అక్కర్లేదన్నట్లుగా మానస్ కానీ.. శ్రీరామచంద్ర కానీ చెప్పటం కనిపిస్తుంది. మొత్తంగా రూ.20 లక్షల భారీ మొత్తాన్ని శ్రీరామచంద్ర మిస్ చేసుకున్నారని చెప్పక తప్పదు.