Begin typing your search above and press return to search.

'సీతా రామం'పై సీనియ‌ర్ టెక్నీషియ‌న్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్‌!

By:  Tupaki Desk   |   4 Aug 2022 6:30 AM GMT
సీతా రామంపై సీనియ‌ర్ టెక్నీషియ‌న్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్‌!
X
వెర్స‌టైల్ అంట్ యంగ్ టాలెంటెడ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ 'సీతారామం'. 'యుద్దంతో రాసిన ప్రేమ‌క‌థ‌' అని ట్యాగ్ లైన్‌. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డ ఈ మూవీ ఆగ‌స్టు 5న శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

తెలుగుతో పాటు త‌మిళ‌, మల‌యాళ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించింది. సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఓపెన్ చేయ‌ని ఓ లెట‌ర్ స్ఫూర్తితో పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, లిరిక‌ల్ వీడియోస్ సినిమాపై మంచి బ‌జ్ ని క్రియేట్ చేశాయి.

బుధ‌వారం అన్న‌పూర్ణ స్టూయోస్ లో జ‌రిగిన ప్రీరిలీజ్ వేడుక‌కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాజ‌రై ఈ మూవీపై మ‌రింత హైప్ ని క్రియేట్ చేశారు. దేశంలో వున్న హ్యాండ్స‌మ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ గురించి అంతా చెబుతున్నార‌ని, ఆ మాట‌లు వింటుంటే సినిమా చూడాల‌నే ఆస‌క్తి మ‌రింత‌గా పెరుగుతోందంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. ఇందులో అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో పాటు యుద్ధం కూడా వుంద‌ని, ర‌ష్యాలో చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదేనేమో అన్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమాపై స‌ర్వ‌త్రా పాజిటివ్ వైబ్ క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా చూసిన చాలా మంది సినిమాపై గుడ్ రిపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా సినిమా బాగుంద‌ని త‌న‌కు అనిపిస్తే త‌ప్ప సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌ని ఓ కీల‌క టెక్నీషియ‌న్ 'సీతారామం' గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించ‌డం ఇప్పడు ఆస‌క్తిక‌రకంగా మారింది. అన్న‌పూర్ణ‌లో మెయిన్ అవుట్ హోడ్ గా గ‌త కొన్నేళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌ సీవీరావు అనే వ్య‌క్తి 'సీతారామం' షార్ట్ క‌ట్ లో మినీ రివ్యూనే ఇచ్చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో 'సీతారామం' వ‌న్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్‌. రైటింగ్‌, స్క్రీన్‌ప్లే , ద‌ర్శ‌క‌త్వం చాలా బాగుంది. ప్ర‌తీ క్రాఫ్ట్ కు సంబంధించిన టెక్నీషియ‌న్స్ త‌మ పూర్తి ఎఫ‌ర్ట్ తో ఈ మూవీకి వ‌ర్క్ చేశారు.

ద‌య‌చేసి ఈ మూవీని థియేట‌ర్ల‌లోనే చూడండి. మీ విలువైన స‌మ‌యానికి థియేట్రిక‌ల్ అనుభూతిని పొంద‌డానికి స‌రైన సినిమా ఇది' అంటూ ఈ మూవీపై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. మంగ‌ళ‌వారం యుఎస్ ప్రింట్స్ ని పంపించే క్ర‌మంలో సినిమా చూసిన సీవీరావు పై విధంగా స్పందించ‌డం విశేషం అని చిత్ర బృందం చెబుతోంది.