Begin typing your search above and press return to search.

అందంలో కూతురిపై డామినేషనా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 8:22 AM GMT
అందంలో కూతురిపై డామినేషనా?
X
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువగా క్రేజ్ అందుకున్న వారిలో హీరోయిన్ శ్రీదేవి కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనలోనే కాకుండా తన పదహారేళ్ల వయసు నుండే అందాలను సరికొత్తగా చూపించడంలో ఆమెకు సాటి ఎవరు లేరని నిరూపించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఆమె ఇప్పుడు తన కూతుళ్లను రంగుల ప్రపంచంలోకి దింపింది. ఎక్కడ ఎలాంటి వేడుక జరిగినా శ్రీదేవి అండ్ డాటర్స్ ఉండాల్సిందే.

ముఖ్యంగా పెద్ద కూతురు జాన్హవి తల్లితో పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని తెగ చుట్టేస్తోంది. రీసెంట్ గా ఇద్దరు కలిసి లాక్మి ఫ్యాషన్ వీక్ లో మెరిశారు. అందం అనే పదానికి సరికొత్త అర్ధం చెబుతోన్న ఆ ఇద్దరు బ్యూటీలు అంత హాట్ గా ఏమి కనిపించలేదు గాని వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ లో కొంచెం డిఫెరెంట్ గా కనిపించరు. కూతురు కొంచెం సింపుల్ గా కనిపించినప్పటికీ శ్రీదేవి మాత్రం ఫ్యాషన్ డోస్ ని కొంచెం ఎక్కువగా పెంచేసిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఫొటోలో ఆమె పేదలకు ఉన్న లిప్ స్టిక్ రంగు ఎక్కువగా ఆకర్షిస్తోంది. డ్రెస్సింగ్ స్టైల్ లో కూడా కూతురుని డామినేట్ చేసేలా కనిపిస్తోంది. జాన్హవి మాత్రం అలా కాకుండా కొంచెం సింపుల్ గా తల్లితో పోటీ పడకుండా అందరిని తనదైన సింపుల్ లుక్స్ తో ఆకర్షించింది. ప్రస్తుతం జాన్హవి తన మొదటి సినిమా ధఢఖ్ షూటింగ్ తో చాలా బిజీగా ఉంది.