Begin typing your search above and press return to search.

ప్చ్.. శ్రీదేవి వయస్సు తగ్గిపోయిందే

By:  Tupaki Desk   |   12 Sep 2016 11:30 AM GMT
ప్చ్.. శ్రీదేవి వయస్సు తగ్గిపోయిందే
X
సీనియర్ హీరోయిన్లలో ఇప్పటికీ బ్యూటీ కోసం పరుగులు తీసే మాజీలు ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం.. వెంటనే మనకు శ్రీదేవి పేరే గుర్తొస్తుంది. ఇప్పటికీ లీడ్ అవకాశాల కోసం ఎదురుచూసే ఈ 53 ఏళ్ళ బ్యూటి.. ఇప్పుడు తన ఫ్యాషన్ స్టేట్మెంట్ తో బాలీవుడ్ లో చెమట్లు పట్టించేస్తోంది. పదండి ఓసారి చూసొద్దాం.

ఈ మధ్యనే ఒక ఈవెంటుకు బ్లూ కలర్ గౌనులో విచ్చేసిన శ్రీదేవి.. తన యంగ్ లుక్స్ తో అదరగొట్టింది. ముఖంలో ఆ క్యూట్ కళ తగ్గిపోయినప్పటికీ.. ఫిజిక్ ను చాలా సింపుల్ గా మెయిన్టయిన్ చేస్తూ అమ్మడు యూత్ కు కితకితలు పెడుతోంది. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ అప్ డేట్లు అన్నీ ఫాలో అవుతూ.. ఆ మధ్యన ఒక వెకేషన్ లో తన కూతుళ్లతో కలసి బికినీలో ఫోజులు ఇచ్చిన శ్రీ.. ఇప్పుడు అంతకంటే యంగ్ హీరోయిన్లా గౌనులో ఫోజులు ఇస్తోంది. కాకపోతే అమ్మడి వయస్సు తగ్గింది కాని.. ఎందుకో సినిమాల ఆఫర్లు మాత్రం రావట్లేదు.

నిజానికి ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సినిమాతో శ్రీదేవి తిరిగి సినిమాల్లోకి ఎంటరైంది అనుకుంటే.. అమ్మడు మాత్రం లీడ్ రోల్స్ మాత్రమే చేస్తాను.. క్యారక్టర్ వేషాలు నాక్కక్కర్లేదు అంటూ నాన్చుతోంది. చివరకు తమిళ పులి సినిమాలో రాజమాతగా నటించి.. ఫెయిలైంది. ఇప్పుడు మరొక సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది సంగతి.