Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ఈ మామ్ ఒక థ్రిల్లరండోయ్
By: Tupaki Desk | 1 April 2017 5:30 PM GMTమామూలుగా 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమా చేసిన తరువాత అందరూ కూడా శ్రీదేవి ఇకమీదట ఇలాంటి చక్కటి సెంటిమెంటల్ ఫ్యామిలీ సినిమాలు చేస్తుందేమో అని అనుకుంటారు. కాని అమ్మడు మాత్రం.. కాస్త లేటైనా కూడా తాను కూడా ఒక యాక్షన్ హీరో టైపులోని సినిమాలూ.. కహానీ తరహా థ్రిల్లర్ సినిమాలూ.. మాంచి సస్పెన్స్ ఉన్న కథలనే చేయాలని కోరుకుని.. ఇప్పుడు ''మామ్'' సినిమాతో మన ముందుకొచ్చింది.
''మామ్'' అంటే ఇదేదో ఒక తల్లి బిడ్డల సెంటిమెంట్ సినిమా అనుకున్నవారందరూ సినిమా టీజర్ చూసి షాకైపోతున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి మిస్సయిపోయిన తన కూతురు గురించి వెతుకుతుందా.. లేదంటే ఆమెకు దూరంగా బ్రతుకుతుందో తెలియదు కాని.. మొత్తానికి ఆమెను ఎవరో వెంటాడుతుంటే.. ఆమె మాత్రం తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. ''ఒక తప్పులో నుండి.. ఒక పెద్ద తప్పులోనుండి.. ఒకటి మీరు కోరుకోవాలంటే.. దేనిని కోరుకుంటారు?'' అనే థీమ్ తో ఈ సినిమాను రూపొందించారు. బట్ట తలతో విలన్ గా నవాజుద్దీన్ సిద్దికీ.. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో అక్షయ్ ఖన్నా.. ఇంప్రెసివ్ గానే ఉన్నారు. ఇక ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన మ్యూజిక్ బాగుంది.
విశేషం ఏంటంటే.. ఈ థ్రిల్లర్ అచ్చం మన ఐశ్వర్యరాయ్ కంబ్యాక్ చిత్రం ''జజ్ఞా''కు దగ్గర్లో ఉంది కదూ. అదేనండీ.. ఒక థ్రిల్లర్ కథాంశంతో ఒక తల్లి పడే ఆవేదనతో ఆ సినిమా రూపొంది. ఇది కూడా సేమ్ టు సేమే. రాహుల్ ఉడ్వయార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. శ్రీదేవి సొంతంగా నిర్మించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/