Begin typing your search above and press return to search.

ఫిట్నెస్ తో పిచ్చెక్కిస్తున్న యాంకరమ్మ!!

By:  Tupaki Desk   |   10 Oct 2016 5:17 AM GMT
ఫిట్నెస్ తో పిచ్చెక్కిస్తున్న యాంకరమ్మ!!
X
యాంకర్ శ్రీముఖి కి బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఈ జనరేషన్ తెలుగు యంగ్ టెలివిజన్ బ్యూటీస్ లో.. సినిమా హీరోయిన్ కట్స్ ఉన్నవారిని లిస్ట్ తీస్తే.. అందులో శ్రీముఖి పేరు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. ఈ విషయం శ్రీముఖికి కూడా బాగానే తెలుసు. అందుకే సినిమాల్లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది కానీ.. ఇంకా ఈ భామకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

టాలీవుడ్ హీరోయిన్ అంటే ఫిజిక్ విషయంలో పట్టింపులు బాగా ఎక్కువ. ఒకటీ అరా ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్న బ్యూటీస్ కి మినహాయింపు ఉంటుంది కానీ.. మిగతా వాళ్లకి ముఖ్యంగా కొత్త అమ్మాయిలకి ఫిట్నెస్ చాలా ముఖ్యం. కానీ పర్సనాలిటీ పరంగా శ్రీముఖి కొంచెం బొద్దుగా ఉంటుంది. అందుకే సరైన ఛాన్సులు ఇప్పటికీ తగల్లేదనే టాక్ ఉంది. అందుకే ఫ్యాట్ అనే కామెంట్స్ నుంచి బయటపడేందుకు ఫిట్నెస్ బాటను ఫాలో అయిపోయిందీ బ్యూటీ.

రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో అయితే.. తన బరువంతా బాగా కరిగించేసిన విషయాన్ని బయటపెట్టేలా భలేగా పోజులు ఇచ్చింది శ్రీముఖి. ఇక ఇప్పటికే హాట్ రోల్స్ కి అబ్జెక్షన్ లేదనే సిగ్నల్స్ పంపేసింది కాబట్టి.. ఇక ఆఫర్స్ ఇచ్చేవాళ్లదే లేట్ అంతా! అన్నట్లు రీసెంట్ గా అవసరాల శ్రీనివాస్ తో సెక్స్ కామెడీ హంటర్ రీమేక్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఆ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/