Begin typing your search above and press return to search.

రాఘవా.. మళ్లీ దాని చుట్టే తీశావా?

By:  Tupaki Desk   |   28 March 2016 5:30 PM GMT
రాఘవా.. మళ్లీ దాని చుట్టే తీశావా?
X
దక్షిణాది సినిమాలు, వాటిలో ఉండే కాన్సెప్ట్ లకు ఒక అడుగు ఎక్కువ దూరంలో తీయడం దర్శకుడు సెల్వ రాఘవన్ స్ట్రాటజీ. ఈయన మొత్తం పేరు అదే ఆయనా... శ్రీ రాఘవ అనే పేరునే నేమ్ కార్డ్స్ లో వేసుకుంటాడు. ఈయన తీసే మూవీస్ సెక్స్ ప్రధానాంశంగా కనిపిస్తుంది. చూడ్డానికి సాధారణంగానే లవ్ - ఫ్యామిలీ ఎంటర్టెయినర్ టైపులో ఉంటాయి కానీ.. వాటిలో మెయిన్ కాన్సెప్ట్ మాత్రం సెక్స్ ఉంటుంది.

గతంలో రాఘవ తీసిన 7/జీ బృందావన్ కాలనీలో ఈ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్ కోసం నడిపించిన స్కెచ్ పక్కాగా కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీరాఘవ రచనలో ఆయన భార్య గీతాంజలి కూడా ఓ మూవీ తీసింది. తమిళ్ లో దాని పేరు 'మాలై నేరత్తు మాయక్కం'. దీన్ని తెలుగులో 'నన్ను వదలి నీవు పోలేవులే' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ మూవీ కూడా సెక్స్ చుట్టూనే తిరుగుతుంది. భార్యా భర్తల మధ్య అనుబంధంలో రేప్/సెక్స్ అనే లైన్ ఒకటి, ప్రేమికుల మధ్య సెక్స్ గురించిన డిస్కషన్స్ మరొకటి.. ఇలా రెండు కాన్సెప్టులు సెక్స్ చుట్టూనే తిరుగుతాయి. కాకపోతే వీటి వెనక ప్యూర్ లవ్ అనే ఫీల్ అంతర్లీనంగా ఉన్నా.. మెయిన్ గా పైకి కనిపించేది మాత్రం సెక్స్ ఒకటే. మరి దక్షిణాది సినిమాల స్థాయికి మించి ఇంటిమేట్ సీన్స్ ఉండే ఈ చిత్రం ఎంతవరకూ ఆకట్టుకుంటుందో ఏప్రిల్ 1న తెలుస్తుంది.