Begin typing your search above and press return to search.

మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:37 PM GMT
మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..!
X
'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం ముగిసినా ఈ క్రమంలో చోటుచేసుకున్న వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల తరువాత ఒకే కుటుంబం సినిమా కుటుంబం అంటూ కలిసి పోతారు అనుకుంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చాకే అసలు వివాదానికి తెర లేపారు. మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎన్నికలు జరిగిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని బూతులు తిట్టారు అంటూ మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు. ఇదే క్రమంలో ఆ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అలానే పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారి లేఖ కూడా రాశారు. ఈ వ్యవహారాలన్నింటినీ గమనిస్తున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి 'మా' ఎన్నికల పరిణామాలపై స్పందించింది.

''మా అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలు చూస్తే నవ్వొస్తుంది. ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి అసోసియేషన్ ముందు కూర్చుంటే ఏమి జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి. శ్రీరెడ్డి కూర్చున్న స్థలాన్ని యాసిడ్ తో కడగాలని కొందరు.. పబ్లిసిటీ స్టంట్ అని మరొకరు.. బెనర్జీ - శ్రీకాంత్ - ఉత్తేజ్ లాంటివారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అప్పుడు హేమ - జీవిత లాంటి వారు నన్ను అవహేళన చేసి జనాల ముందు నన్ను అసహ్యంగా చిత్రీకరించారు. ఆ రోజు నేను ఏడ్చినప్పుడు నా కన్నీళ్ళు తుడవడానికి 'మా' నుంచి ఒక్క ఆడది కూడా రాలేదు. ఆరోజు నన్ను ఏడిపించిన ప్రతీ ఒక్కరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు'' అని శ్రీరెడ్డి అన్నారు.

''ఎందుకు అంత పదవీ వ్యామోహం. అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు?. మీరు గెలిచి ఉండుంటే.. బ్యాలెట్ అలా అయినవి. వాళ్లు మమ్మల్ని అన్యాయం చేశారు. మమ్మల్ని కొట్టారు. మమ్మల్ని గిల్లారు. మమ్మల్ని కొరికారు. ఇలా ఏడ్చేవాళ్లా మీరు?. అసలు 'మా' అసోసియేషన్ లో ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి.అసలైన అన్యాయాల గురించి.. మానభంగాల గురించి.. స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి నోరు విప్పినపుడు, కంటి తుడుపుకైనా ఒక్కళ్లు రాలేదు. ఈ రోజు పదవి కోసం ఇంతమంది గుక్కపట్టి ఏడుస్తున్నారు. సిగ్గుండాలి మీ అందరికీ'' శ్రీరెడ్డి 'మా' సభ్యులపై ఫైర్ అయింది.

''సేవే పరమార్థం అనుకుంటే, ఇందులో మాకొచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు.. మేము అందరికీ సేవ చేసుకోవడానికే అంటే.. అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకంత కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా చేయాల్సింది. అది ఎవరో ఒకరు చేస్తారు. అలాంటప్పుడు ఎందుకింత పబ్లిసిటీ స్టంట్లు. ఒకప్పుడు నేను చేసేది పబ్లిసిటీ స్టంట్లు అన్నారు కదా.. మరి ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చేస్తుందేంటి? అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ మీద కూడా నిప్పులు చేరిగింది. 'మా' లో ఈ రాజీనామా డ్రామాలు.. ఏడుపులు అన్నీ వెనకుండి నడిపించేది మెగాస్టార్ - నాగబాబు - పవన్ కళ్యాణ్ అని.. వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీ మీద తమకున్న ఆధిపత్యం చేజారిపోవడంతో తట్టుకోలేక మెగా ఫ్యామిలీ ఇలా చేస్తోందని.. మంచు విష్ణు గెలిచిన తర్వాత చిరంజీవి స్పీచ్ చూస్తే అది అర్థం అవుతుందని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

మెగాస్టార్ ఓడిపోవడంతో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందని.. అసోసియేషన్ లో కమ్మ వెర్సెస్ కాపు కులాల ఫీలింగ్ బాగా వచ్చేసిందని శ్రీరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసింది. వీరు గెలిస్తే అజమాయిషీ పెత్తనం నడుస్తుందని తిరుగుబాటు మొదలైందని.. తాము సపోర్ట్ చేసినా ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలవలేదని నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసారని ఆమె అన్నారు. పనిలో పనిగా చిరంజీవి - పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేసుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవారని.. వీళ్ళు ఇండస్ట్రీకి పట్టిన శని అని.. బయటి వాళ్ళకి కొత్త వాళ్లకు అవకాశాలు రానివ్వకుండా చేస్తారని అందరికి తెలుసని శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.