Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటీ నిన్నొద‌ల బొమ్మాళీ

By:  Tupaki Desk   |   26 Feb 2019 4:11 AM GMT
ద‌గ్గుబాటీ నిన్నొద‌ల బొమ్మాళీ
X
వ‌ద‌ల బొమ్మాళీ.. నిన్నొద‌ల‌! వ‌ద‌ల‌మ‌న్నా వ‌ద‌లా!! .. ఇలానే ఉంది వివాదాస్ప‌ద‌ న‌టి శ్రీ‌రెడ్డి తీరు. ఇండ‌స్ట్రీ టాప్ సెల‌బ్రిటీల నీతిమంత‌మైన జీవితాన్ని ప్ర‌శ్నించిన తొలి నారిగా ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలుగుతోంది. అడ‌గాల్సింది అడిగేస్తూ... క‌డ‌గాల్సింది క‌డిగేస్తూ జాతీయ మీడియాలో సైతం ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చింది. త‌న‌లాంటి అబ‌లలు ఈ మాయ‌దారి రంగుల ప్ర‌పంచంలో ఎలా బ‌లైపోతున్నారు? అన్న పాయింట్ ని, ప్ర‌శ్న‌ను రెయిజ్ చేస్తూ 2018 లో ఇండ‌స్ట్రీ బెస్ట్ సెల‌బ్రిటీల‌కు స‌వాల్ విసిరింది. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) త‌న‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌క‌పోవ‌డంపైనా పోరాటం సాగించింది. వివాదం చినికి చినికి గాలి వానై చివ‌రికి ప‌లువురు సెల‌బ్రిటీలు త‌న‌ని లైంగికంగా వేధించారంటూ మీడియా లైవ్ లోకెక్క‌డం సంచ‌లన‌మైంది.

అయితే ఆ ఎపిసోడ్స్ అన్నీ స‌ద్దుమ‌ణిగాయి అనుకుంటుండ‌గానే మ‌రోసారి ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో మ‌రోమారు టాప్ సెల‌బ్రిటీల‌పై కామెంట్లు చేస్తూ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌స్తోంది. మ‌ర్చిపోయారు అనుకున్న పాత గాయాల్ని తిరిగి రేపుతోంది. ఇదివ‌ర‌కూ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ - నేచుర‌ల్ స్టార్ నాని వంటి వారిపై విరుచుకుప‌డిన శ్రీ‌రెడ్డి.. తాజాగా ద‌గ్గుబాటి హీరోల‌పైనా దృష్టిసారించ‌డం వేడెక్కిస్తోంది. తాత .. తండ్రి.. కొడుకులు అంటూ ఒక్క‌సారిగా హీటెక్కించింది శ్రీ‌రెడ్డి.

ద‌గ్గుబాటి రానా - త్రిష ఘాటైన చుంబ‌న దృశ్యానికి సంబంధించిన ఓ ఫోటోకి - రానా సోద‌రుడు ద‌గ్గుబాటి అభిరామ్ త‌న‌ని ముద్దాడుతున్న ఫోటోని జోడించి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసారు శ్రీ‌రెడ్డి. పాత ఫోటోల‌కే కొత్త క‌ల‌రింగ్ అద్దిన వైనం ప్ర‌స్తుతం మ‌రోసారి వేడెక్కిస్తోంది. అక్క‌డితో ఆగిపోలేదు.. రానా - అభిరామ్ ల డాడ్.. ప‌రిశ్ర‌మ అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబుపై ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. కుటుంబ గౌర‌వం గురించి మాట్లాడే పెద్దాయ‌న త‌న కొడుకుల్ని ఎందుకు అదుపులో పెట్టలేక‌పోయారు? అనే అర్థంలో ఘాటైన వ్యాఖ్య‌ల్ని గుప్పించ‌డం సంచ‌ల‌నమైంది. ``ప‌రువులు.. ఫ్యామిలీస్.. ప‌ర్స‌న‌ల్స్.. బుద్ధి.. జ్ఞానం.. భ‌క్తి... అన్నీ మాట్లాడే సురేష్ బాబు గారు పిల్ల‌ల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదికి వ‌దుల్తారా? స‌ర‌సాల్లో చ‌నిపోయిన మీ తాత ని మించిపోయారు వార‌సులు. వీట‌న్నిటికీ అడ్డా @ రామానాయుడు స్టూడియోస్!!`` అంటూ ఘాటైన ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డం ఒక్క‌సారిగా వేడెక్కిస్తోంది. శ్రీ‌రెడ్డి కామెంట్ల‌పై ద‌గ్గుబాటీస్ ఏవిధంగా స్పందించ‌నున్నారో అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఫిలింన‌గ‌ర్ లో సాగుతోంది.