Begin typing your search above and press return to search.
దేవరకొండ సరే.. విచక్షణ ఉండాలి కదా
By: Tupaki Desk | 19 April 2018 5:30 PM GMTఓ పెద్ద బూతు.. అక్షరాలలో రాసేందుకు.. అర్ధం వివరించేందుకు కూడా అసహ్యం అనిపించేంతటి పెద్ద మాట. ఆ పదాన్ని ఉపయోగిస్తూ పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం చాలా పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ ను తిట్టమనే తానే చెప్పానంటూ పశ్చాత్తాపం చెందేసిన రాంగోపాల్ వర్మ.. పాప ప్రాయశ్చిత్తం కోసం క్షమాపణలు కూడా చెప్పేశాడు. ఇందులో వాస్తవాల గురించి పక్కన పెట్టేద్దాం.
ఇలా పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి ముందు తనకు స్ఫూర్తి రగిలించిన వ్యక్తి విజయ్ దేవరకొండ అన్నాడు వర్మ. అర్జున్ రెడ్డి మూవీలో అదే మాటను ట్రైలర్ లో వదిలేయడం.. ఆడియో లాంఛ్ ఈవెంట్ లో కుర్రాళ్లతో అనిపించడం.. ట్రైలర్ తో కట్ చేసినా.. ఈ మాట జనాల్లోకి వెళ్లిపోవడం జరిగింది. అదంతా ఓ ఎత్తయితే.. ఇదే మాటను పవన్ కళ్యాణ్ పై ఉపయోగించాలని వర్మ సలహా ఇవ్వడంతో.. శ్రీరెడ్డి వాడేసిందన్నది లేటెస్ట్ అప్ డేట్. అర్జున్ రెడ్డి అంటే అదో సినిమా.. అందులో ఓ క్యారెక్టర్. ఆ సినిమా కోసం చేసిన ప్రచారం ఎపిసోడ్ మాత్రమే అదంతా. ఆ తర్వాత విజయ్ దేవరకొండ అలా మాట్లాడడు కదా.
వర్మ చెప్పినంత మాత్రాన.. ఓ మహిళ అయి ఉండి.. శ్రీరెడ్డి అదే పదాన్ని ఉపయోగించడం అనేది కచ్చితంగా అభ్యంతరకరమే. పదుల కొద్దీ కెమేరాలు ముందు ఉన్నపుడు.. కోట్ల మంది చూస్తున్నారనే అటెన్షన్ బ్రెయిన్ లో ఉండగా.. ఓ స్టార్ హీరోని అనే కాదు.. ఏ వ్యక్తిని అయినా ఇలా మాట్లాడే ముందు.. కాసింత విచక్షణ ఉపయోగించి ఉంటే.. కచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.
సినిమాల్లో చాలానే చెబుతారు.. సమరసింహారెడ్డి సినిమాల్లో నరికేసుకుంటారు.. కొన్ని సినిమాల్లో తిట్టుకుంటారు.. అంతెందుకు రీసెంట్ గా వచ్చిన రంగస్థలం మూవీలో 'ఆ లం.. కొడుకు' అనే పదాన్ని కనీసం బీప్ కూడా చేయకుండా ఉంచేశారు. అంతెందుకు.. వర్మ సినిమాల్లో కూడా చాలా క్రూరంగా నరికేసుకోవడం.. చంపేసుకోవడం కనిపిస్తుంది. అవన్నీ ఆయా సినిమాల్లో ఉన్న సీన్స్.. సన్నివేశాల ప్రకారం మాత్రమే ఉంటాయి. వాటిని తెచ్చి విచక్షణా రహితంగా రియల్ లైఫ్ లో ఇదుగో ఇలాగే అందరికీ సారీలు చెప్పుకుంటూ.. జనాలతో ఛీ కొట్టించుకుంటూ ఉండాల్సొస్తింది.