Begin typing your search above and press return to search.
పీకేకు సారీ..జీవిత..నాగబాబులపై పంచ్ లు
By: Tupaki Desk | 18 April 2018 9:56 AM GMTసంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది సినీ నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ పై తన పోరాటం అంటూ మొదలు పెట్టిన ఆమె.. తర్వాతి దశల్లో పలువురిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవటం కనిపిస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతికి చెక్ పెట్టేలా చేయటమే తన లక్ష్యమని చెప్పిన ఆమె రీసెంట్ గా పవన్ ను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలతో ఆమె నిరసన మొత్తం పక్కదారి మళ్లింది.
పవన్ ను.. పవన్ తల్లిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై అందరూ ఆమెను తప్పు పట్టారు. ఇదిలా ఉంటే తన తప్పుల్ని క్షమించాలని.. తాను మనిషినేనని తప్పుఒప్పులు చేశానని పేర్కొన్నారు. పీకేకు సారీ చెప్పిన ఆమె.. పీకే అభిమానులు తన స్నేహితులుగా పేర్కొంటూ ఫేస్ బుక్ లో మెసేజ్ లు పెట్టారు.
ఇదిలా ఉంటే.. శ్రీరెడ్డి పోస్టులు ఫేస్ బుక్ లో ఒకటి తర్వాత ఒకటిగా పోస్టు అవుతున్న వేళ.. నాగబాబు ప్రెస్ మీట్ పెట్టటం.. ఫిలిం ఛాంబర్ ఎదుట సినీ నటి మాధవీ లత మౌనదీక్ష చేయటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటిలా టీవీ ఛానళ్లకు అందుబాటులోకి రాని శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ వేదికగా చేసుకొని తన సందేశాల్ని మెసేజ్ రూపంలో పెట్టటం షురూ చేశారు.
పవన్ కల్యాణ్ కు సారీల మీద సారీ చెప్పిన ఆమె.. పవన్ సోదరుడు నాగబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. అదే సమయంలో జీవితా రాజశేఖర్ తన ఫస్ట్ టార్గెట్ అంటూ ప్రకటించి మరో సంచలనానికి తెర తీశారు. నాగబాబును బాబుగారు అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించిన శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.
జీవితా రాజశేఖర్ ఫస్ట్ టార్గెట్ మీరే..
"నా పోరాటం కొనసాగుతుంది. చావోరేవో ఏదో ఒకటి తేల్చుకునే వరకు ఆగను. ఇక ముందు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటాను. వెనకడుగు వేసేది లేదిప్పుడు. నా జీవితచరిత్ర మొత్తం చెప్పేస్తాను. నాదే కాదు నాకు సంబంధించిన వ్యక్తులందరి చరిత్రలూ బయటపెడతా. ఏ అంశమైనా చట్టపరంగా వెళ్లాలన్న పవన్ కల్యాణ్ గారి సూచనను స్వీకరిస్తున్నాను. నా దగ్గరున్న ఆధారాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తా. నా మొదటి లక్ష్యం.. జీవితా రాజశేఖర్" అంటూ పేర్కొన్నారు.
మరో పోస్టులో బాబుగారు అంటూ పేర్కొన్న శ్రీరెడ్డి కాసింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ శ్రీరెడ్డి వ్యవహారం పక్కదారి పట్టిందని.. అవగాహన లేకుండా మాట్లాడుతుందన్నారు. మా ను కించపర్చొద్దన్న ఆయన తమ తల్లిని అన్నా తాము ఏమీ అనటం లేదని.. ఆడపిల్ల అన్న ఉద్దేశంతో వదిలేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ అంశాల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మంచితనం ముసుగులో బతుకుతున్న మీరు మానసిక వైద్యం చేయించుకోండి బాబుగారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి శ్రీరెడ్డి పోస్టులు చూసినప్పుడు..ఐ క్లౌడ్ కి థ్యాంక్స్ చెప్పటం.. మనషుల కంటే కూడా ఐక్లౌడ్ బాగా సాయం చేసిందని పేర్కొన్నారు. తన పోరాటాన్ని నాశనం చేయాలనుకునే వారు తొలుత తనను చంపేయాలంటూ పోస్ట్ చేసింది.