Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు
By: Tupaki Desk | 18 April 2018 8:06 AM GMTసంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్న సినీ నటి శ్రీరెడ్డి తాజాగా ఫేస్ బుక్ వేదికగా చేసుకొని మెసేజ్ ల మీద మెసేజ్ లు పెడుతున్నారు. కొన్ని గంటల క్రితం జీవితంలో మొదటిసారి ఒంటరిగా అనిపిస్తోందంటూ మెసేజ్ పెట్టిన ఆమె.. ఈ జన్మకిది చాలు అంటూ మెసేజ్ పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో.. ఆమె తన పోరాటాన్ని ఆపేసిందన్న వాదనలు వినిపించాయి.
అదే సమయంలో ఒక టీవీ చానల్ బ్రేకింగ్ న్యూస్ ప్రకారం తాను నోరు జారి మాట అనేసిన పవన్ కల్యాణ్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. తాను తప్పుగా మాట్లాడానని.. క్షమించాలని కోరారు. తాను చేసింది తప్పేనని.. క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నెమ్మదించేలా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. పవన్ చేసిన సూచనను తాను తప్పక ఫాలో అవుతానని.. కేసుల ద్వారా న్యాయ పోరాటాన్ని చేస్తానని వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.
గెలుపు అయినా ఓటమి అయినా తాను వెనక్కి తగ్గేది లేదంటూ మరో పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. ఒక అంశంపై తాను పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. తన జీవిత చరిత్ర మొత్తాన్ని చెబుతానని.. మంచి చెడులను దాచుకోకుండా వెల్లడిస్తానన్నారు. తన స్నేహితురాలి గుట్టును రట్టు చేస్తానంటూ నటి మాధవీలతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
తాను మనిషినని.. తప్పొప్పులు చేసినట్లుగా అంగీకరించారు. కాస్టింగ్ కౌచ్ పై తన పోరాటం ఆగదని.. తన స్నేహితులతో కలిసి తాను పోరాడతానని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను తన స్నేహితులుగా శ్రీరెడ్డి పేర్కొనటం గమనార్హం. పక్కా ఆధారాలతో తాను న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్న శ్రీరెడ్డి.. తనకు అండగా నిలిచిన మహిళా సంఘాలు.. హక్కుల సంఘాల వారితో కలిసి పోరాటం చేస్తానంది. పవన్ చెప్పిన సూచనల్ని తాను పాటిస్తానని.. ఆయన చెప్పిన రీతిలోనే న్యాయపోరాటాన్ని సాగిస్తానని పేర్కొన్నారు.
తన లీక్స్ కొనసాగుతాయని శ్రీరెడ్డి తన వరుస పోస్టులలో స్పష్టం చేశారు. తన తాజా పోస్టులతో తాను వెనక్కి తగ్గలేదని చెప్పటంతో పాటు.. తాను తప్పుగా మాట్లాడిన పవన్ తల్లికి సారీ చెప్పి.. ఆయన అభిమానుల్ని తన స్నేహితులుగా అభివర్ణించటం గమనార్హం.