Begin typing your search above and press return to search.

పోలీస్ ఆఫీస‌ర్ గా శ్రీ‌రెడ్డి..!

By:  Tupaki Desk   |   24 Aug 2018 9:56 AM GMT
పోలీస్ ఆఫీస‌ర్ గా శ్రీ‌రెడ్డి..!
X
క్యాస్టింగ్ కౌచ్ అంశంతో టాలీవుడ్ తో పాటు.. జాతీయ మీడియాను ఆక‌ర్షించారు సినీ న‌టి శ్రీ‌రెడ్డి. కొన్ని వారాల పాటు మీడియాలో ఆమె సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఎప్పుడేం చేస్తారో తెలీని ప‌రిస్థితిని క‌ల్పించారు. క్యాస్టింగ్ కౌచ్ తో పాటు.. కొన్ని అంశాల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా ఆమె ప‌లువురి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

క్యాస్టింగ్ కౌచ్ మీద తాను చేస్తున్న పోరాటానికి తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ స్పందించ‌టం లేదంటూ.. ఫిలిం చాంబ‌ర్ ఎదుట అర్థ‌నగ్న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌టం ద్వారా ఆమె పెను సంచ‌ల‌నానికి తెర‌తీశారు. శ్రీ‌రెడ్డి తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్ట‌ట‌గా.. ఎలాంటి ప‌రిస్థితుల్లో తాను అలాంటి ప‌ని చేసిందో చెప్పుకొచ్చారు శ్రీ‌రెడ్డి.

టాలీవుడ్ నుంచి చెన్నై మ‌కాం మార్చిన ఆమె.. త‌మిళ సినీ రంగానికి చెందిన ప‌లువురి మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. తానుచేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన సాక్ష్యాలు ఉన్న‌ట్లు పేర్కొన్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌పెట్టిన‌వి ఏమీ లేవు. ఇదిలా ఉంటే.. త‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో త‌మిళ మీడియాలో త‌ళుక్కుమంటున్న శ్రీ‌రెడ్డి.. ఈ మ‌ధ్య‌న రెడ్డి డైరీ పేరుతో నిర్మిస్తున్న చిత్రంలో ఆమె న‌టిస్తున్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఈ చిత్రం శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ గా ప్ర‌చార‌మైంది. అయితే.. జ‌రుగుతున్న ప్ర‌చారానికి వాస్త‌వానికి సంబంధం లేద‌ని.. ఈ చిత్రం త‌మిళ న‌టికి సంబంధించినదిగా చెబుతోంది శ్రీ‌రెడ్డి. తాను న‌టిస్తున్న రెడ్డి డైరీ బ‌యోపిక్ కాద‌ని వెల్ల‌డించింది. వేరే న‌టి క‌థ అని చెప్ప‌టం ద్వారా కొత్త స‌స్పెన్స్ కు తెర తీసింది.

ఈ చిత్రంలో తానొక పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించింది. త్వ‌ర‌లో తన బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తాని శ్రీ‌రెడ్డి చెబుతోంది. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్లు చెప్పిన ఆమె.. ఆ వివ‌రాల్ని త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతోంది. సో.. ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు వ‌చ్చిన రెడ్డి డైరీ శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ కాద‌న్న‌ది లేటెస్ట్ అప్డేట్ గా చెప్పాలి.