Begin typing your search above and press return to search.
నరేశ్ పై శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 Oct 2019 5:42 AM GMTనా ఇష్టం వచ్చినట్లు ఉంటా. నాకు తోచినట్లు మాట్లాడతా. ఎవరినైనా ఏ మాట అయినా అనేస్తా అనే అటిట్యూడ్ కొందరిలో ఉంటుంది. నిజమే.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటంలో తప్పే మాత్రం లేదు. కాకుంటే.. తమకు తోచినట్లు తాము ఉన్న కారణంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. కానీ.. సినీ నటి.. వివాదాలతో సహవాసం చేసే శ్రీరెడ్డి మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోదు.
తాను ఎవరినైనా ఏమైనా అనాలనుకుంటే వెనుకా ముందు చూసుకోకుండా అనేస్తుంది. ఎందుకిలా? అని ఎవరూ క్వశ్చన్ చేయకూడదు. అలాంటి ప్రయత్నం చేస్తే వారికి మరింత ఇబ్బంది కలిగేలా ఆమె వ్యవహారశైలి ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న వివాదం హాట్ టాపిక్ అయిన వేళ.. అనుకోని రీతిలో ఎంట్రీ ఇచ్చిన శ్రీరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చారు.
ఆ మధ్య జరిగిన మా ఎన్నికల్లో జీవితా రాజశేఖర్ ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. తాజాగా మా అధ్యక్షుడు నరేశ్ ను టార్గెట్ చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్టు సంచలనంగా మారింది. తన కంటే పెద్దవారి విషయంలో కాస్త మర్యాద.. గౌరవంతో వ్యవహరించాలన్న విషయాల్ని ఆమె పూర్తిగా వదిలేసినట్లుగా తాజా వ్యాఖ్య స్పష్టం చేస్తుందని చెప్పాలి.
నరేశ్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్.. మిగితా సగం గోసి మా మెంబర్స్ లాగేశారంటూ పోస్టు చేశారు. అక్కడి వరకూ పోస్టు ఆపినా అంతో ఇంతో బాగుండేది. కానీ.. ఆ తర్వాత వాడిన బూతు పదం దారుణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకరిని తిట్టాలన్నా.. వారి తీరును తప్పు పట్టాలన్నా.. తీవ్రమైన మాటల్ని అనటానికి మించి మరింకేమీ ఉండదా? అన్న భావన శ్రీరెడ్డి తాజా పోస్టు చూస్తే కలుగక మానదు.
మా అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నికయ్యాక వచ్చిన ఫండ్స్ ఏమిటి? గడిచిన తొమ్మిది నెలల్లో ఏం జరుగుతంది? ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి? అంటూ జీవితా రాజశేఖర్ అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే. దీంతో.. అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ కు.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జీవితా రాజశేఖర్ కు మధ్య విబేదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలోనూ గొడవ జరిగిందని.. సీనియర్ నటుడు కమ్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకొని వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే..అవన్నీ తప్పని తర్వాత ఆయన ఖండించారు. ఇలాంటి వేళ నరేశ్ ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన ఫేస్ బుక్ పోస్టు తీవ్ర సంచలనంగా మారింది. తప్పు ఎత్తి చూపించేందుకు వెలెత్తి చూపటం తప్పేం కాదు. కానీ.. ఏ వేలు అన్నది కూడా ముఖ్యమన్నది మర్చిపోకూడదు. ఈ విషయంలో శ్రీరెడ్డి తీరు ఏ మాత్రం బాగోలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.