Begin typing your search above and press return to search.

బట్టలిప్పేయలే... బట్టలూడదీశా: శ్రీరెడ్డి

By:  Tupaki Desk   |   15 April 2018 6:17 PM GMT
బట్టలిప్పేయలే... బట్టలూడదీశా: శ్రీరెడ్డి
X

టాలీవుడ్‌ ను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు మహిళా ఆర్టిస్టుల్లో బాధితుల్లో చాలామంది సంఘటితమై సినిమా ఫీల్డులో ఉన్న మహిళలకు సంబంధించిన అనేక సమస్యలపై మాట్లాడుతున్నారు. అంతేకాదు.. ఇకపై తెలుగు నటీమణులను సినిమాల్లో తీసుకోకపోతే సినిమాలను బయటకు రానివ్వకుండా చేస్తామని శ్రీరెడ్డి హెచ్చరించారు.

తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిీడి’ అనే అంశంపై హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చలో మహిళా సంఘాల నేతలతో పాటు శ్రీరెడ్డి, నటి అపూర్వ పాల్గొన్నారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్చలో పాల్గొన్న శ్రీరెడ్డి మాట్లాడుతూ ఫిల్మ్ నగర్ లోని అన్ని ఆఫీసులు బ్రోతల్ హౌస్ లుగా మారాయన్నారు. సాయంత్రం ఆరు దాటితే వారి విచ్చలవిడి చేష్టలకు అంతులేదని ఆరోపించారు.

సినిమాల్లో అవకాశాల కోసం తనలాంటి ఎందరో ఆడవాళ్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.. ‘బట్టలిప్పేసింది’ అని గోల చేస్తున్నారు,ఎవరి బట్టలిప్పేశాను? మీ బట్టలు ఊడదీశాను అంటూ ఆమె సినీ పెద్దలను ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ (మా)లో సభ్యత్వం ఉన్న నటి అపూర్వ అక్క మా కోసం ఈరోజు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు.. ‘మా’ సభ్యత్వం తన కొద్దని అసోసియేషన్ నుంచి ఆమె బయటికి వచ్చేశారంటే ఇక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.

అదేసమయంలో ‘మా’కు అనుకూలంగా మాట్లాడుతున్న మహిళా ఆర్టిస్టులను ఉద్దేశించి శ్రీరెడ్డి మాట్లాడుతూ, ‘మా’కు తొత్తులుగా బతికే మహిళలు ఇంకా అక్కడే ఉన్నారని, అలా పిరికి పందళ్లా ఎన్నిరోజులు బతుకుతారు? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో లొంగిపోకపోతే అవకాశాలు లేవని, అలా అని చెప్పి అందరూ అలానే లొంగిపోతారని తాను చెప్పడం లేదని, తప్పు చేయని వారు కూడా ఉన్నారని శ్రీశక్తి చెప్పింది. అయితే, తనకు ఎదురైన సంఘటనలన్నీ బాధాకరమైనవేనని, అయినప్పటికీ, తనను మోసం చేశారని తెలిపింది. తన చేతకాన్ని తనాన్ని అదునుగా తీసుకుని తనపై నిషేధం విధించారని, అందుకే మహిళా శక్తి నిద్రలేచిందని ఆమె అన్నారు. కార్యక్రమంలో నటి అపూర్వ, మహిళా సంఘాల నేత సంధ్య కూడా మాట్లాడుతూ ఇకపై సినీ పరిశ్రమలో మహిళలు ధైర్యం తెచ్చుకోవాలన్నారు.