Begin typing your search above and press return to search.

నాగబాబును బూతులు తిట్టేసింది

By:  Tupaki Desk   |   8 March 2019 5:40 AM GMT
నాగబాబును బూతులు తిట్టేసింది
X
మెగా బ్రదర్‌ నాగబాబు మై ఛానెల్‌ నా ఇష్టం అంటూ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా రాజకీయ పంచ్‌ లు వేస్తూ - రాజకీయాలపై కామెంట్స్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా టీడీపీ నాయకురాలు యామినీ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ సెన్షేషనల్‌ శ్రీరెడ్డి రియాక్ట్‌ అయ్యింది. అందుకలడు ఇందు లేడు అన్న సందేహం వలదు అన్నట్లుగా శ్రీరెడ్డి ఈమద్య వరుసగా అన్ని విషయాలపై స్పందిస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న కౌశల్‌ గురించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా నాగబాబుపై విరుచుకు పడింది. నాగబాబును రాయలేని మాటలతో తిట్టింది.

నాగబాబు మై ఛానెల్‌ నా ఇష్టం యూట్యూబ్‌ ఛానెల్‌ కు కౌంటర్‌ గా అన్నట్లుగా శ్రీరెడ్డి కూడా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. తాను యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించడానికి నాగబాబు గారు ఆదర్శం అంటూ చెప్పింది. నాగబాబు మాత్రమే వీడియోలు చేస్తాడా - చిడతలు కొడతాడా నేను కూడా వాయిస్తాను - నేను కూడా వీడియోలు చేస్తాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. టీడీపీ నాయకురాలు యామిని గారిని నాగబాబు విమర్శించడం ఆయన దిగజారుడుతనంకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చింది. అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన నాగబాబు ఏ మొహం పెట్టుకుని రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు.

తాను జనసేన పార్టీలో లేను - నేను జనసేన పార్టీలో కనీసం మెంబర్‌ ను కూడా కాదు అంటూనే నాగబాబు ఎందుకు ఇలా ఆ పార్టీకి భజన చేస్తున్నాడు. మీ కూతురును ఎవరైనా కామెంట్‌ చేస్తే మీరు ఊరుకుంటారా - 60 ఏళ్లు వచ్చిన మీరు యామిని గారిని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్‌ అని మీరు భావిస్తున్నారు. ఒకప్పుడు మీ అమ్మగారిని కామెంట్‌ చేశారంటూ నీ జనాలతో రాళ్లతో కొట్టించావు కదా, అప్పుడు మీడియా ముందుకు వచ్చి తెగ మాట్లాడావు కదా, మరి ఇప్పుడు ఒక మహిళ అయిన యామిని గారిని ఎందుకు అలా విమర్శించావు, పోలీసు వ్యవస్థను రౌడీలు అంటూ ఎలా సంభోదిస్తావు, అసలు నీకు ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది.