Begin typing your search above and press return to search.

రకుల్ కి స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

By:  Tupaki Desk   |   7 April 2018 10:16 AM GMT
రకుల్ కి స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి
X
నటి శ్రీరెడ్డి ఉదంతం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కాక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఫీలవుతున్నారు ప్రేక్షకులు. ఇవాళ మా అసోసియేషన్ దగ్గర అర్ధ నగ్న ప్రదర్శనతో నానా రచ్చ చేసిన శ్రీరెడ్డి వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తాను ఫేస్ బుక్ లో ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ అయితే పెట్టానో అవి నిజమో కాదో వాళ్ళ మనఃసాక్షికి తెలుసని ఒకవేళ అబద్దమని బుకాయిస్తే దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని కాస్త వేదాంత ధోరణిలో చెప్పడం విశేషం. శేఖర్ కమ్ముల పేరు చెప్పకుండా అందరికి సులభంగా అర్థమయ్యేలా కొద్ది రోజుల క్రితం శ్రీరెడ్డి చేసిన పోస్ట్ గురించి రేగిన వివాదంలో శేఖర్ కమ్ముల సారీ డిమాండ్ చేస్తే శ్రీరెడ్డి తోసిపుచ్చిన విషయం చూసాం.

ఇవాళ శ్రీరెడ్డిని ఒక విలేఖరి ప్రశ్న అడుగుతూ రకుల్ ప్రీత్ సింగ్ అసలు కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏవి పరిశ్రమలో లేవని ఇవన్ని వట్టి గాలి వార్తలే అని కొట్టిపారేసిన విషయాన్ని గుర్తు చేయగా శ్రీరెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యింది. కోట్లు కోట్లు సంపాదిస్తూ జిమ్ములు - పబ్బులు - రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళకు తనలాంటి వాళ్ళ కష్టాలు కనిపించవని దెప్పి పొడిచింది. ఇంకోసారి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ఉద్యమం గురించి చులకనగా మాట్లాడితే రకుల్ పళ్ళు రాలగొట్టి కట్టుడు పళ్ళ కోసం ముంబై పరిగెత్తేలా చేస్తానని నేరుగా వార్నింగ్ ఇవ్వడం అక్కడున్న వాళ్ళను విస్తుపోయేలా చేసింది. శేఖర్ కమ్ముల ని కూడా ఈ ఇష్యూ లోకి లాగింది శ్రీ రెడ్డి. ఆ తరువాత శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి సారీ చెప్పాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారని ఆమె ప్రశ్నించింది

మరో రెండు రోజుల్లో తన సభ్యత్వం గురించి స్పందన రాకపోతే ఎవరూ ఊహించని చర్యకు పాల్పడతానని చెబుతున్న శ్రీరెడ్డి అదేంటి అనేది మాత్రం గుట్టు విప్పలేదు. తన దగ్గర వీడియోలు - పెద్ద వాళ్ళ గురించి సాక్ష్యాలు ఉన్నాయని కేవలం ఇండస్ట్రీ మీద గౌరవంతో బయట పెట్టడం లేదని చెబుతున్న శ్రీరెడ్డి రెండు మూడు రోజుల తర్వాత ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది